Home » యాంకర్ సుమను గోపీచంద్ అక్కడ పట్టుకున్నారా.. ఎంత దారుణమంటే..?

యాంకర్ సుమను గోపీచంద్ అక్కడ పట్టుకున్నారా.. ఎంత దారుణమంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad
 తెలుగు సినిమా ఇండస్ట్రీలో యాంకర్ సుమ అంటే తెలియని వారు ఉండరు. ప్రస్తుతం ఉన్నటువంటి టాప్ యాంకర్లలో  సుమ మొదటి స్థానంలో ఉంటారని చెప్పవచ్చు. అలాంటి యాంకర్ సుమ  ఏదైనా ప్రోగ్రాంలో నోరు తెరిచింది అంటే  ఎదుటి వారికి పంచ్ పడాల్సిందే.ఎలాంటి టైం నైనా సరే తన సమయస్ఫూర్తితో ఇట్టే మార్చేయగల  గొప్ప యాంకర్. ఎప్పుడు అందరినీ అలరిస్తు నవ్విస్తూ  తన మాటలతో కట్టిపడేస్తుంది. ఆమె చాలా షోలలో  యాంకర్ గా చేస్తూ ప్రముఖ ఛానల్లో హోస్ట్ గా కూడా వ్యవహరిస్తోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్లు ,  స్టార్ హీరోల ఇంటర్వ్యూలు,  ఇతర కార్యక్రమాలలో తన మాటలు పంచులతో  ఎదుటివారిని  ఇట్టే తన వైపు తిప్పుకుంటుంది.
అయితే సుమ అడ్డా అనే పేరుతో ప్రచారం అవుతున్న ఒక షోలో సినీ స్టార్లు తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి వస్తుంటారు. నిజం చెప్పాలి అంటే బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా వచ్చిన  ఏకైక షో ఏదైనా ఉంది అంటే అది సుమ షో మాత్రమే.  తాజాగా ఈ షోలో రామబాణం చిత్ర బృందం సందడి చేసింది.  ఇందులో గోపీచంద్, డింపుల్ హయాతి, డైరెక్టర్ శ్రీనివాస్,  గెటప్ శీను వచ్చి సినిమా గురించి విషయాలు పంచుకున్నారు.  చిత్రానికి సంబంధించిన ముచ్చట్లతో పాటు వారికి సుమా కొన్ని గేమ్స్ కూడా ఆడించింది.
ఇక ఈ షోలో గోపీచంద్ హైపర్ యాక్టివ్ గా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. చాలా రిజర్వుడ్ గా ఉండే గోపీచంద్  ఈ షోలో చలాకీగా కనిపించారు. ఇందులో గోపీచంద్ అప్పట్లో విలన్ గా నటించిన జయం స్ఫూఫ్ చేసినట్టు తెలుస్తోంది. సదాను గొంతు పట్టుకొని పైకి లేపే సీన్లు గోపీచంద్ పవర్ ఫుల్ డైలాగ్ చెబుతారు. ఆ సీన్  లాగానే  ఈ షోలో కూడా గోపీచంద్ సుమ గొంతు పట్టుకొని  డైలాగ్ చెబుతున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే మే 5వ తేదీన రామబాణం ప్రేక్షకులు ముందుకు రానుంది.

Advertisement

Visitors Are Also Reading