Home » మగధీరలో కాజల్ కన్నా ముందు ఆ హీరోయిన్ అనుకున్నారట..కానీ చిన్న రీజన్ తో రిజెక్ట్..!!

మగధీరలో కాజల్ కన్నా ముందు ఆ హీరోయిన్ అనుకున్నారట..కానీ చిన్న రీజన్ తో రిజెక్ట్..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

రామ్ చరణ్ హీరోగా కాజల్ హీరోయిన్ గా సంచలనం సృష్టించిన మూవీ మగధీర. ఈ సినిమా పేరు వినగానే అందరికీ టక్కున గుర్తుకు వచ్చేది కాలభైరవ. ఈ చిత్రంలో హర్షా లో చరణ్ మొదటి పార్ట్ లో నటించాడు. కానీ జనాలందరికీ కాలభైరవ రోలే నచ్చింది. 2009 జూలై 31న గ్రాండ్గా థియేటర్స్ లో విడుదల చేశారు. చిరుత సినిమాతో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ సెకండ్ సినిమాతోనే టాలీవుడ్ రికార్డులను బద్దలు కొట్టారు. ముఖ్యంగా ఈ సినిమాలో రాజమౌళి స్క్రీన్ ప్లే, కథకు జనాలు ఫిదా అయిపోయరని చెప్పవచ్చు. అంతేకాకుండా రామ్ చరణ్ ను ఒక మంచి హీరోగా, అలాగే కాజల్ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా ఇది.

Advertisement

also read:వ‌కీల్ సాబ్ సూప‌ర్ ఉమెన్ నిజ జీవితంలో అన్ని క‌ష్టాల‌ను అనుభ‌వించిందా..?

Advertisement

ఈ సినిమా పెట్టిన దానికి డబుల్ లాభాలు తీసుకొచ్చి నిర్మాతలకు ఫుల్ హ్యాపీనెస్ ఇచ్చింది. అయితే ఈ చిత్రంలో హీరోకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో హీరోయిన్ కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చారు అన్నది మనకు తెలుసు. ఇందులో రాజమౌళి కేవలం గ్లామర్ పరంగానే కాకుండా నటనాపరంగా కూడా కంటెంట్ ఇచ్చి కాజల్ కెరీర్ కి బిగ్గెస్ట్ సక్సెస్ ఇచ్చారు. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్గా మొదట అనుకున్నది కాజల్ అగర్వాల్ కాదట. ముందుగా చూస్ చేసుకుంది టాలీవుడ్ టాలెస్ట్ బ్యూటీ అనుష్క శెట్టి ని.

కానీ అప్పటికే అనుష్క విక్రమార్కుడు సినిమాతో తన టాలెంట్ నిరూపించుకోవడంతో మరోసారి రాజమౌళి డైరెక్షన్లో చాన్స్ వస్తే ఈమె కెరీర్ కు తిరుగు ఉండదు అంటూ చెప్పుకొచ్చారు. కానీ ఈ చిత్రాన్ని అనుష్క రిజెక్ట్ చేసిందట. దీనికి కారణం ఏంటంటే చరణ్ కాస్త పొట్టిగా ఉంటాడు.. అనుష్క శెట్టి చాలా హైట్. ఇక తెరపై వీరిద్దరూ అక్క తమ్ముళ్ల లాగా ఉంటారు. హీరో హీరోయిన్ గా ఉండరు. అందుకే ఈ సినిమాను రిజెక్ట్ చేసిందట.

also read:

Visitors Are Also Reading