Home » వ‌కీల్ సాబ్ సూప‌ర్ ఉమెన్ నిజ జీవితంలో అన్ని క‌ష్టాల‌ను అనుభ‌వించిందా..?

వ‌కీల్ సాబ్ సూప‌ర్ ఉమెన్ నిజ జీవితంలో అన్ని క‌ష్టాల‌ను అనుభ‌వించిందా..?

by AJAY
Ad

సినిమా ఇండ‌స్ట్రీలో ఒక్క చాన్స్ వ‌స్తే చాలాని క‌ల‌లు కంటూ ఉంటారు. సినిమాల‌లో అవ‌కాశాలు వ‌చ్చిన త‌ర‌వాత కూడా ఇబ్బందులు త‌ప్ప‌వు. కొంత‌మంది నిర్మాత‌లు సినిమాల‌లో న‌టించిన వారికి డ‌బ్బులు ఇవ్వ‌కుండా సైతం మోసం చేస్తుంటారు. దాంతో ప‌గ‌ల‌న‌క రాత్రి అన‌క క‌ష్ట‌ప‌డి న‌టించినా రెమ్యున‌రేష‌న్ లు రాక‌పోవ‌డంతో న‌టీన‌టులు ఎంతో ఇబ్బంది ప‌డుతుంటారు. అలాంటి క‌ష్టాలే త‌న‌కు కూడా వ‌చ్చాయ‌ని వ‌కీల్ సాబ్ లేడీ పోలీస్ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించింది.

Advertisement

వ‌కీల్ సాబ్ సినిమాలో లేడీ పోలీస్ పాత్ర‌లో నటించిన న‌టి పేరు లిరిష‌….వ‌కీల్ సాబ్ కంటే ముందు ఈ న‌టి చాలా సినిమాల‌లో న‌టించింది. కానీ వ‌కీల్ సాబ్ సినిమాలో ఆమె చేసి పోలీస్ పాత్ర‌తో ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. లికిష ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటూ సీరియ‌ల్స్ లోనూ న‌టిస్తోంది.

Advertisement

కాగా తాజా ఇంట‌ర్వ్యూలో లిరిష మాట్లాడుతూ….రెమ్యున‌రేష‌న్ విష‌యంలో చాలా ఇబ్బందిపడిన‌ట్టు తెలిపారు. త‌ప్ప స‌ముద్రం అనే ఓ సినిమాలో న‌టించాన‌ని ఆ సినిమాలో న‌టించినందుకు ఇప్ప‌టికీ తన‌కు రెమ్యున‌రేష‌న్ ఇవ్వ‌లేద‌ని చెప్పారు. నిర్మాత‌కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అడ్వాన్స్ ఇచ్చార‌ని బ్యాలెన్స్ అలాగే ఉంద‌ని చెప్పారు. ఆయ‌న ఇక డ‌బ్బులు ఇచ్చేలా లేడ‌ని వ‌దిలేసుకున్న‌ట్టు తెలిపారు. అంతే కాకుండా వ‌రుడు సినిమా కోసం కూడా తాను చాలా రోజులు షూటింగ్ లో పాల్గొన్నాన‌ని..ఫైన‌ల్ క‌ట్ లో అక్క‌డ‌క్క‌డా మాత్ర‌మే క‌నిపించాన‌ని చెప్పారు. త‌న‌కు రెమ్యున‌రేష‌న్ కూడా స‌గ‌మే ఇచ్చార‌ని చెప్పారు.

Visitors Are Also Reading