Home » హిట్ 2 సినిమాలో ఈ సీన్ గ‌మ‌నించారా..? మీకూ అదే డౌట్ వ‌చ్చిందా..?

హిట్ 2 సినిమాలో ఈ సీన్ గ‌మ‌నించారా..? మీకూ అదే డౌట్ వ‌చ్చిందా..?

by AJAY
Ad

ఒక‌ప్పుడు సినిమా వ‌చ్చిందంటే అందులో ఎంట‌ర్టైన్మెంట్ మాత్ర‌మే చూసేవారు. కానీ ఇప్పుడు అలా కాదు ప్రేక్ష‌కులు చాలా తెలివిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వేరే సినిమా నుండి పాట‌లు సీన్ లు కాపీ కొట్టినా ప‌సిగ‌ట్టేస్తున్నారు. అంతే కాకుండా సినిమాలో చిన్న చిన్న లాజిక్ లు మిస్ అయినా కూడా వాటిని గుర్తుప‌ట్టి నెట్టింట ట్రోల్స్ చేస్తున్నారు.

 

Advertisement

ఇక ఆ లాజిక్ లు మీమ‌ర్స్ కు దొరికాయంటే అంతే సంగ‌తి. ర‌క‌ర‌కాల మీమ్స్ చేస్తూ ఆ సినిమా తీసిన ద‌ర్శ‌కుల‌ను ట్రోల్ చేస్తుంటారు. ప్ర‌స్తుతం హిట్ 2 సినిమా పై కూడా అలాంటి ట్రోల్స్ ద‌ర్శ‌నం ఇస్తున్నాయి. ఈ సినిమాకు శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా మొద‌టి పార్ట్ లో విశ్వ‌క్ సేన్ హీరోగా న‌టించగా పార్ట్ 2 లో అడవిశేష్ హీరోగా న‌టించాడు. స‌స్సెన్స్ థ్రిల్ల‌ర్ కథాంశంతో ఈ సినిమా తెర‌కెక్కింది.

Also Read: బాలీవుడ్ స్టార్ హీరోతో అల్లు అర్జున్ మల్టీస్టారర్ మూవీ.. దర్శకుడు ఎవరంటే..?

Advertisement

అయితే ఈ సినిమా థియేటర్ లో విడుద‌లైన‌ప్పుడు ప్రేక్ష‌కులు పెద్ద‌గా లాజిక్ ల‌ను గ‌మ‌నించ‌లేదు కానీ ఓటీటీలో విడుద‌లైన త‌ర‌వాత మాత్రం లాజిక్ లను సైతం వెతుకుతున్నారు. ఈ సినిమాలో సైకో కిల్ల‌ర్ సుహాస్ న‌టించాడు. కాగా సుహాస్ సైకో కిల్ల‌ర్ అని తెలియ‌క ముందు సుహాస్ గ‌ర్ల్ ఫ్రెండ్ కు థ్రెడ్ ఉంద‌ని త‌న జీప్ కు ఫోటో క‌నిపించ‌డంతో కేడీ అక్క‌డ‌కు వెళ‌తాడు. అయితే అక్క‌డే సుహాస్ తో పాటూ అత‌డి గ‌ర్ల్ ఫ్రెండ్ ఉంటారు.

దాంతో అక్క‌డ క్రిమిన‌ల్స్ ఎవ‌రూ లేర‌ని కేడీ వెన‌క్కి వెళ‌తాడు. అలా వెళ్లే స‌మయంలో త‌న గ‌ర్ల్ ఫ్రెండ్ ఫోటోనే జీప్ కు క‌నిపిస్తుంది. కానీ క్లైమాక్స్ లో సీరియ‌ల్ కిల్ల‌ర్ సుహాస్ అని తెలిసిపోతుంది. దాంతో సుహాస్ ఇంట్లోనే ఉంటే జీప్ కు కేడీ గ‌ర్ల్ ఫ్రెండ్ ఫోటో ఎవ‌రు పెట్టాబ్బా అని నెటిజ‌న్స్ ట్రోల్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :  శాకుంతలం ట్రైలర్ లో అల్లు అర్హ లుక్ ని చూశారా..? ఎలా ఉందంటే..?

Visitors Are Also Reading