Home » బాలీవుడ్ స్టార్ హీరోతో అల్లు అర్జున్ మల్టీస్టారర్ మూవీ.. దర్శకుడు ఎవరంటే..?

బాలీవుడ్ స్టార్ హీరోతో అల్లు అర్జున్ మల్టీస్టారర్ మూవీ.. దర్శకుడు ఎవరంటే..?

by Anji
Ad

అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇటీవల పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. దీంతో బన్నీ క్రేజ్ రోజు రోజుకు పెరుగుతోంది. అల్లు అర్జున్ స్టార్ డమ్ పుష్ప సినిమా ఎక్కడికో వెళ్లిపోయింది. ప్రధానంగా అల్లు అర్జున్ కెరీర్ లోనే పుష్ప బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలిచింది. ఈ చిత్రంతో బన్నీ ఫ్యాన్ బేస్ రెట్టింపు కావడమే ఇండియా లెవెల్ క్రేజ్ దక్కింది. సుకుమార్ రూపొందించిన ఈ చిత్రం అన్ని భాషల ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు.

Advertisement

ఇతర భాషలకు చెందిన పలువురు నటీనటులు కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో నటించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 లో నటిస్తున్నాడు. ఇంకా షూటింగ్ బన్నీ మరోవైపు త్రివిక్రమ్ తో మరో సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ తో ఓ సినిమాకి తెరకెక్కిస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చి అల వైకుంఠపురం ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. 

Advertisement

Also Read :   బాలకృష్ణ, రవితేజ మధ్య ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా..?

త్రివిక్రమ్ సినిమా 2023 సమ్మర్ లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఈ సినిమాలో మల్టీస్టారర్ హిందీ హీరో కార్తీక్ ఆర్యన్ కూడా ఈ సినిమాలో ఉంటాడని.. ఇద్దరి ఫ్రెండ్స్ మధ్య జరిగే ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఈ సినిమా తెలుస్తోంది. గతంలోన బన్నీకి త్రివిక్రమ్ ఈ సినిమాకి సంబంధించిన కథ చెప్పాడని.. ఆ కథనే ఇప్పుడు మూవీగా చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్- త్రివిక్రమ్–  కార్తీక్ ఆర్యన్ కాంబినేషన్ అంటే ఈ చిత్రంపై భారీ అంచనాలుండే అవకాశముంది. ఇది వాస్తవమో కాదో తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజుల వరకు వేచి చూడాల్సిందే..! 

Also Read :  శాకుంతలం ట్రైలర్ లో అల్లు అర్హ లుక్ ని చూశారా..? ఎలా ఉందంటే..?

Visitors Are Also Reading