Home » శాకుంతలం ట్రైలర్ లో అల్లు అర్హ లుక్ ని చూశారా..? ఎలా ఉందంటే..?

శాకుంతలం ట్రైలర్ లో అల్లు అర్హ లుక్ ని చూశారా..? ఎలా ఉందంటే..?

by Anji
Ad

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో దర్శకుడు గుణశేఖర్ రూపొందిస్తున్న మైథిలాజికల్ చిత్రం శాకుంతలం. ఓ అద్భుతమైనటువంటి పౌరాణిక దృశ్యకావ్యమును తెలుగు ప్రేక్షకుల ముందుకు ఫిబ్రవరి 17న తీసుకురాబోతున్నారు. భారత సినీ ప్రియులు 2023లో వీక్షించాలనుకుని ఆసక్తి కనబరుస్తున్న విజువల్ వండర్ గా శాకుంతలం తనదైన ప్రత్యేకతను సంపాదించుకుంది. 

Advertisement

ఇందులో సమంత శాకుంతలంగా కనిపించగా.. స్టార్ నిర్మాత దిల్ రాజు సమర్పణలో భారీ బడ్జెట్ తో నీలిమ గుణ నిర్మిస్తున్నారు. ప్రముఖ కవి కాళిదాస్ రచించిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా  శాకుంతలం చిత్రాన్ని గుణశేఖర్ తెరకెక్కిస్తున్నారు. శకుంతల, దుష్యంత మహారాజు మధ్య అద్భుతమైన ప్రేమకథను రూపొందించారు. దుష్యంతుడిగా మలయాల నటుడు దేవ్ మోహన్ నటించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల చేశారు మూవీ మేకర్స్. 

Also Read :  దర్శకుడు బాబీకి గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక మరదలు అవుతుందనే విషయం మీకు తెలుసా..? 

విడుదలైన ట్రైలర్ లో దుర్వాస మహర్షిగా మోహన్ బాబు.. మేనకగా మధుబాలతో పాటు సీనియర్ నటి గౌతమి ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ కూడా కీలక పాత్రలో కనిపించనుంది. శాకుంతలం ట్రైలర్ రాగానే అందరి కళ్లు అర్హ కోసం వెతకసాగాయి. సోషల్ మీడియాలో ఎప్పుడూ చాలా అల్లరిగా క్యూట్ గా కనిపించే అర్హ.. శాకుంతలం సినిమాలో ఎలాంటి లుక్ లో కనిపించిందో తెలుసుకునేందుకు ఆసక్తి చూపించారు నెటిజన్లు. ఈ చిత్రం యొక్క ట్రైలర్ లో అర్హను ఆసక్తికరంగా చూపించారు గుణశేఖర్.

Advertisement

Also Read :  Chiranjeevi: మరోసారి కొరటాల శివపై సెటైర్లు వేసిన మెగాస్టార్ చిరంజీవి..!!

ఇందులో అల్లు అర్హ శకుంతల కుమారుడు భరతుడి చిన్నప్పటి పాత్రలో కనిపించనుంది. తాజాగా విడుదలైన శాకుంతలం ట్రైలర్ చివరలో చిన్ననాటి భరతుడిగా సింహంపై కూర్చొని ఎంట్రీ ఇచ్చింది అర్హ. సింహంపై చాలా క్యూట్ గా కనిపిస్తున్న అర్హను చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అర్హ ఎంత బాగా నటించిందని.. ఆమెకు సంబంధించిన వీడియో క్లిప్ ని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆ వీడియోను మీరు కూడా ఓ లుక్కెయండి. 

Also Read : పోటీ ఎవరున్నా..గెలుపు అన్నదే..హీరో రవితేజ కామెంట్స్ వైరల్..!!

Visitors Are Also Reading