Home » “లైగ‌ర్” సినిమా కోసం మైక్ టైసన్ అన్ని కోట్లు తీసుకున్నాడా..? స్టార్ హీరోలకు మించి..?

“లైగ‌ర్” సినిమా కోసం మైక్ టైసన్ అన్ని కోట్లు తీసుకున్నాడా..? స్టార్ హీరోలకు మించి..?

by AJAY
Published: Last Updated on
Ad

విజ‌య్ దేవ‌ర‌కొండ పూరీ కాంబినేష‌న్ లో వ‌చ్చిన లైగ‌ర్ సినిమా ఆగ‌స్ట్ 25న విడుద‌లై ప్రేక్ష‌కుల మందుకు వచ్చింది. ఈ సినిమా పై ముందు నుండి భారీ అంచ‌నాలు నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. పూరీ సినిమా అన‌గానే ప‌క్కా హిట్ అవుతుంద‌ని భావించారు. మ‌రోవైపు సినిమాలో విజ‌య్ లుక్ చూసి క‌చ్చితంగా సినిమాలో మ్యాట‌ర్ ఉంటుంద‌ని భావించారు. సినిమా టీజ‌ర్ ట్రైల‌ర్ లు కూడా అంచ‌నాల‌ను పెంచేశాయి. ఇక సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అన‌న్య పాండే హీరోయిన్ గా న‌టించింది.
ఇవి కూడా చదవండి: లైగ‌ర్ ప‌రాజ‌యం కావ‌డానికి ద‌ర్శ‌కుడు సుకుమార్ కార‌ణ‌మా..?

Advertisement

అదేవిధంగా భారీ బ‌డ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. మ‌రోవైపు బాక్సింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో బాక్సింగ్ దిగ్గ‌జం హాలీవుడ్ న‌టుడు మైక్ టైస‌న్ ముఖ్య‌మైన పాత్ర‌లో న‌టించారు. ఇక ఈ సినిమా విడుద‌ల‌కు ముందు మైక్ టైస‌న్ పాత్ర ఓ రేంజ్ లో ఉంటుందేమో అని ప్రేక్ష‌కులు అనుకున్నారు. కానీ సినిమా విడుద‌ల‌య్యాక చూసి షాక్ అయ్యారు.

Advertisement

సినిమాలో టైసన్ ముఖ్య‌మైన పాత్ర‌లో న‌టించార‌నుకుంటే ఆయ‌న పాత్ర‌నే కామెడీగా చేశారు. ఇక ఈ సినిమా కోసం న‌టీన‌టులు భారీగానే రెమ్యున‌రేష‌న్స్ పుచ్చుకున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ ఈ సినిమాకు రూ.35 కోట్ల వ‌ర‌కూ తీసుకున్నాడంటూ టాక్ వినిపిస్తోంది. అంతే కాకుండా అన‌న్య పాండే కు కూడా ఐదు కోట్లకు పైగానే ఇచ్చార‌ట‌.

ఇక త‌ల్లి పాత్ర‌లో న‌టించిన ర‌మ్య‌కృష్ణ‌కు కూడా కోటి వ‌ర‌కూ రెమ్యున‌రేష‌న్ ఇచ్చిన‌ట్టు టాక్. అంతే కాకుండా హాలీవుడ్ నుండి వ‌చ్చిన మైక్ టైస‌న్ కు ఈ సినిమా కోసం ఏకంగా రూ.20 నుండి రూ.25 కోట్ల రెమ్యున‌రేష‌న్ ను ఇచ్చార‌ని టాక్. అయితే ఇందులో ఎంత‌వ‌ర‌కు నిజం ఉందో తెలియ‌దు కానీ ఈ వార్త మాత్రం నెట్టింట తెగ‌వైర‌ల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి: RRR, KGF 2, కార్తికేయ 2 తో స‌హా బాలీవుడ్ లో ఎక్కువ వ‌సూళ్లు సాధించిన సినిమాలు ఇవే..!

Visitors Are Also Reading