Home » ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు.. మెగాస్టార్ ట్వీట్ వైర‌ల్‌..!

ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు.. మెగాస్టార్ ట్వీట్ వైర‌ల్‌..!

by Anji
Ad

ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి తెలియ‌ని వారుండరు. ఆయ‌న పేరులోనే ఒక ప‌వ‌ర్ ఉందని అంటుంటారు. ఆయ‌న పేరు వింటేనే చాలా మంది అభిమానులు సంబుర‌ప‌డుతుంటారు. ఈ పేరు ఒక్క‌టి చాలు ఏం అవ‌స‌రం లేదు.. భారీ డైలాగ్‌లు చెప్ప‌క‌పోయినా.. క‌ళ్లు చెదిరే డ్యాన్స్‌లు చేయ‌క‌పోయిన కేవ‌లం ఆయ‌న క‌టౌట్ క‌నిపిస్తు చాలాఉ ప్రేక్ష‌కులు ఉర్రూత‌లూగిపోతారు. థియేట‌ర్ల‌లో పండుగ చేసుకుంటారు. తెర‌పై ఎంతో హంగామా చేసే ప‌వ‌ర్ స్టార్ తెర వెనుక మాత్రం చాలా సాదాసీదాగా ఉంటారు. అందుకేనేమో చాలా మంది అత‌న్ని ఇష్ట‌ప‌డుతుంటారు. ప్ర‌స్తుతం ఓ వైపు సినిమాలు, మ‌రోవైపు రాజ‌కీయంలో రాణిస్తున్నారు.

Advertisement

అయితే ఇవాళ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పుట్టిన రోజు కావ‌డంతో అర్థ‌రాత్రి నుంచే ఫ్యాన్స్ హంగామా మొద‌లైంది. కేక్స్ క‌ట్ చేస్తూ సెల‌బ్రెట్ చేసుకుంటున్నారు. కొన్ని ఏరియాల్లో ప‌వ‌న్ పోస్ట‌ర్ల‌కు పాలాభిషేకం చేస్తూ పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియజేస్తున్నారు. పుట్టిన రోజు సంద‌ర్భంగా అటు సినీ ప్ర‌ముఖులు, ఇటు రాజ‌కీయ నాయ‌కుల నుంచి సోష‌ల్ మీడియాలో ప‌వ‌న్‌కి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్న‌య్య అయిన‌టువంటి మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్ సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.

ముఖ్యంగా త‌న ఆశ‌, ఆశ‌యం ఎల్ల‌ప్పుడూ జ‌న‌హిత‌మే. తాను న‌మ్మిన సిద్ధాంతం కోసం ఎప్పుడు నిజాయితితో, చిత్త‌శుధ్దితో శ్ర‌మించే ప‌వ‌న్ క‌ళ్యాన్ ఆశ‌యాల‌న్ని నెర‌వేరాల‌ని కోరుకుంటూ.. ఆశీర్వ‌దిస్తూ క‌ళ్యాణ్ బాబుకి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నాన‌ని చిరంజీవి ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ గా మారింది.

ఇది కూడా చ‌ద‌వండి :  సమంత కాకుండా చైతూకు ఆ స్టార్ హీరో కూతురితో పెళ్లి సెట్టైందా..కానీ ఆపిందెవరంటే..?

మెగాస్టార్ చిరంజీవితో ప‌లువురు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి ట్వీట్ ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. వారిలో ప్ర‌ధానంగా నిర్మాత‌ బండ్ల గ‌ణేష్ ట్వీట్ చూసిన‌ట్ట‌యితే ఈ విశ్వంలో సూర్యుడు ఒక్క‌డే, చంద్రుడు ఒక్క‌డే ప‌వ‌న్ ఈశ్వ‌రుడు ఒక్క‌డే. మా దేవ‌ర‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు అని బండ్ల గ‌ణేష్ పోస్ట్ చేశాడు. అదేవిధంగా నా గురువు, నా బ‌లం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ మామ‌కి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు. ప్రేమ‌,ఆరోగ్యం, ఆనందంతో ప్ర‌తీ రంగంలో రాణించాల‌ని కోరుకుంటున్నాను అని హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ ట్వీట్ చేశాడు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా మారు మ్రోగిపోతోంది.

ఇది కూడా చ‌ద‌వండి :   ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి ప‌వ‌ర్ స్టార్ బిరుదు రావ‌డానికి కార‌ణం ఎవ‌రో తెలుసా..?

Visitors Are Also Reading