Home » సమంత కాకుండా చైతూకు ఆ స్టార్ హీరో కూతురితో పెళ్లి సెట్టైందా..కానీ ఆపిందెవరంటే..?

సమంత కాకుండా చైతూకు ఆ స్టార్ హీరో కూతురితో పెళ్లి సెట్టైందా..కానీ ఆపిందెవరంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు ఇండస్ట్రీలో కొన్ని నెలల క్రితం మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ ఎవరైనా ఉన్నారు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది సమంత నాగ చైతన్య. ఎంతో అన్యోన్యంగా జీవించే వీరి పర్సనల్ లైఫ్ లో ఏం జరిగిందో ఏమో ఒక్కసారిగా వారి వివాహ బంధానికి బ్రేకప్ చెప్పేసి విడాకుల పేరుతో అందరికీ షాక్ ఇచ్చారు.. దీంతో అభిమానులంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు..

Advertisement

విడాకులు తీసుకున్న వీరు మళ్లీ కలుస్తారని చాలామంది భావించారు కానీ అది ఇప్పటికీ నెరవేరలేదు. అయితే వీరి విడాకులకు అసలు కారణం ఏమిటో ఎవరికీ తెలియదు.. అయితే తాజాగా సమంత నాగ చైతన్య విడాకుల అనంతరం మరో అంశం తెర మీదకు వస్తోంది..

ALSO READ:దుర్భర జీవితం గడుపుతున్న స్టార్ హీరో భార్య.. కూరగాయలు అమ్ముకుంటూ..!!

Advertisement

నాగ చైతన్య సమంతని కాకుండా మరో అమ్మాయిని పెళ్లి చేసుకునే వారట, నాగ చైతన్య ప్రేమ విషయం వారి ఇంట్లో తెలియక ముందు అక్కినేని కుటుంబ సభ్యులు నాగచైతన్యకు ఎక్కడైనా సంబంధం చూశారా అని అనుమానం చాలా మందికి కలిగింది.. అయితే ఈ ప్రశ్నకు నాగార్జున పలు సందర్భాల్లో జవాబు చెప్పారు.. తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్ మరియు ఏఎన్ఆర్ కుటుంబాల మధ్య ఎంతటి సాన్నిహిత్యం ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారి తర్వాత ఈ స్నేహం నాగార్జున, బాలకృష్ణ మధ్య కూడా కొనసాగుతూ వస్తోంది. వీరిద్దరిలో ఎవరి ఇంట్లో ఫంక్షన్స్ జరిగినా ఒకరికి ఒకరు హాజరవుతారు.

 

అయితే ఈ స్నేహాన్ని మీరు బంధుత్వంగా మలుచుకోవాలని అనుకున్నారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అయితే బాలకృష్ణ చిన్న కూతురును నాగచైతన్యకు ఇచ్చి వివాహం చేయాలని అప్పట్లో ఇరు కుటుంబాలు నిర్ణయం కూడా తీసుకున్నారని సినీ వర్గాల్లో వార్తలు వినిపించాయి.. ఈ క్రమంలోనే సమంతతో లవ్ లో ఉన్న మ్యాటర్ నాగ చైతన్య చెప్పడంతో నాగార్జున వెనక్కి తగ్గినట్టు సమాచారం.. ఒకవేళ నాగ చైతన్య సమంతతో ప్రేమలో పడి ఉండకపోతే.. ఇప్పుడు నందమూరి బాలయ్య ఫ్యామిలీకి అల్లుడు గా ఉండేవారని చాలా మంది అంటుంటారు.. ఈ విధంగా నాగచైతన్య చేతులారా తన పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు.

ALSO READ:కోహ్లీ స్థానానికి సూర్య కుమార్ ఎసరు..?

Visitors Are Also Reading