Home » ఎన్టీఆర్ మూవీలో అల్లు అర్హ.. నిమిషానికి అన్ని లక్షల పారితోషికమా..?

ఎన్టీఆర్ మూవీలో అల్లు అర్హ.. నిమిషానికి అన్ని లక్షల పారితోషికమా..?

by Anji
Ad

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అల్లు వారి ఫ్యామిలీ అంటే ఓ ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ఉందనే చెప్పాలి. ముఖ్యంగా అల్లు రామలింగయ్య, అల్లు అరవింద్ సినీ రంగంలో వీరు తమదైన ముద్రవేశారు. ప్రస్తుతం ఇదే ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. మరోవైపు అల్లు అర్జున్ ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ కూడా ఇప్పటికే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. సమంత శాకుంతలం మూవీలో అల్లు అర్హ ఓ పాత్రలో చేసి అందరినీ మెప్పించింది.

Advertisement

ప్రస్తుతం ఆమె ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న దేవర సినిమాలో నటించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో అల్లు అర్హ నిమిషానికి లక్షల పారితోషకం తీసుకోబోతుందని సమాచారం. టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకరైనటువంటి కొరటాల శివ-పాన్ ఇండియా స్టార్ హీరో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న మూవీ దేవర. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వికపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. RRR మూవీ తరువాత ఎన్టీఆర్ దేవర మూవీ వస్తుండటంతో భారీగానే అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ విడుదలై మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది. ఈ నేపథ్యంలోనే మరో వార్త బయటికి రావడం విశేషం. 

Advertisement

ఈ చిత్రంలో జాన్వీకపూర్ చిన్నప్పటి పాత్ర కోసం అల్లు అర్జున్ కూతురు అర్హాని తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఎన్టీఆర్ స్వయంగా ఫోన్ చేసి అల్లు అర్జున్ ని అడిగారట. దీంతో అల్లు అర్జున్ కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. అల్లు అర్హ రెండో మూవీకే భారీగా పారితోషికం తీసుకుంటుంది. నిమిషానికి రెండు లక్షల చొప్పుల తీసుకుంటున్నట్టు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమాలో ఆమె పాత్ర కేవలం 10 నిమిషాలు మాత్రమే ఉండబోతుందట. ఈ లెక్కన బట్టి చూస్తే దాదాపు అల్లు అర్హ మొత్తం రూ.20లక్షలు పారితోషికం తీసుకుంటుందని తెలుస్తోంది. అల్లు అర్జున్ అభిమానులు అల్లు అర్హ రేంజ్ అలాంటిది మరీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

మరికొన్ని  ముఖ్యమైన వార్తలు : 

ప్రభాస్ అభిమానులకు జగపతి బాబు షాక్ ఇచ్చాడా..? అసలు ఏం జరిగిందంటే..?

ఆ ముగ్గురు హీరోల గురించి రామ్ చరణ్ ఆసక్తికర కామెంట్స్.. సోషల్ మీడియాలో వైరల్..!

Visitors Are Also Reading