Home » Klinkara : మెగా ప్రిన్సెస్​ ‘క్లీంకార’ కొణిదెల కోసం స్పెషల్​ రూమ్​..వీడియో వైరల్

Klinkara : మెగా ప్రిన్సెస్​ ‘క్లీంకార’ కొణిదెల కోసం స్పెషల్​ రూమ్​..వీడియో వైరల్

by Bunty
Ad

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు మెగా కోడలు ఉపాసన ఇటీవల కాలంలోనే.. తల్లిదండ్రులు అయిన సంగతి తెలిసిందే. జూన్ 20వ తేదీన మెగా కోడలు ఉపాసన ఒక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో.. మెగా కోడలు ఉపాసన… మెగా వారసురాలికి జన్మనిచ్చి… మొదటిసారిగా తల్లి అయింది. ఇక ఈ పండగ వాతావరణం ఇప్పటికి మెగా కుటుంబంలో కొనసాగుతూనే ఉంది.

Advertisement

అంతేకాదు గత పది రోజుల కిందట.. మెగా వారసరాలు బారసాల కార్యక్రమం కూడా జరిగింది. ఈ సందర్భంగా మెగా వారసురాలికి క్లింకారా అనే పేరు కూడా పెట్టారు. ఇక మెగా వారసరాలు బారసాల కార్యక్రమం చాలా గ్రాండ్‌ గా నిర్వహించారు మెగా
కుటుంబ సభ్యులు. ఇది ఇలా ఉండగా, మెగా ప్రిన్సెస్ ‘క్లింకారా’ కోసం రామ్ చరణ్, ఉపాసన దంపతులు స్పెషల్ రూమ్ సిద్ధం చేశారు.

Advertisement

అమ్రాబాద్ అడవి, వేద వైద్యం ప్రేరణకు అత్యుత్తమ వాతావరణంలో చిన్నారి పెరిగేలా బెస్ట్ ఇంటీరియర్ డిజైన్ తో గదిని రూపొందించారు. ఈ వీడియోను ఉపాసన ట్విట్టర్ లో షేర్ చేశారు. క్లింకారాకు జన్మనివ్వడం, అందమైన వాతావరణంలో పెంచడానికి ఎంత ఆనందిస్తున్నానో చెప్పలేనని పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌.. శంకర్‌ దర్శకత్వం లో గేమ్‌ ఛేంజర్‌ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ దశలో ఉంది.

ఇవి కూడా చదవండి

దవడ పగిలినా బౌలింగ్‌ చేసి….చరిత్ర సృష్టించిన అనిల్ కుంబ్లే

ఆసియా కప్ కి లైన్ క్లియర్.. ఇండియా-పాక్ మ్యాచ్ ఎక్కడంటే?

Baby Movie Review : బేబీ సినిమా రివ్యూ..రౌడీ హీరో తమ్ముడు హిట్టు కొట్టాడా ?

Visitors Are Also Reading