Home » Niharika : మెగా డాటర్ రీ ఎంట్రీ..!

Niharika : మెగా డాటర్ రీ ఎంట్రీ..!

by Anji
Published: Last Updated on

 మెగాస్టార్ చిరంజీవి  సోదరుడు నాగబాబు కూతురు నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఉంటూ తన జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంది. గత కొద్ది రోజుల క్రితం నిహారిక ఇంస్టాగ్రామ్ అన్ని డిలీట్ చేయడం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఆ తర్వాత ఈ అమ్మడు పబ్బు కేసులో దొరకడం సంచలనంగా మారిన విషయం విదితమే.

ఈ కేసు తర్వాత నిహారిక ఇంటికే పరిమితం అయింది. మీడియా ప్రెషర్ తట్టుకోలేక కొద్దిరోజులు కెమెరాకు దూరంగా ఉన్న మెగా డాటర్ ఇటీవలే నిర్మాత గా మరో ప్రాజెక్టు మొదలు పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఈ అమ్మడు మరోసారి ఇంస్టాగ్రామ్ లోకి అడుగుపెట్టింది. తాజా ఫోటోను షేర్ చేస్తూ అందరికీ వెల్కమ్ చెప్పింది. కొద్దిరోజులు తాను నేర్చుకున్న పాఠాలను కూడా లైన్ గా చెప్పింది. ఇంస్టాగ్రామ్ కు బ్రేక్ చెప్పిన 8 వారాల్లో మూడు పాఠాలను నేర్చుకున్నాను.

అందులో ముఖ్యంగా 1. ఈ ప్రపంచం ఇంకా అంతం కాలేదు. 2. ఇతరులు ఏం చేస్తున్నావ్ అనేది పట్టించుకోను. 3. నేను ఇప్పుడు రిఫ్రెష్ అయ్యాను. ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టడానికి ఉత్సాహం కనబరుస్తున్నాను అని పోస్ట్ చేయడం వైరల్ అయింది. పలువురు నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కొందరు వెల్ కమ్ బ్యాక్ నిహారిక అంటే.. మరికొందరు ఎప్పటిమాదిరిగానే ట్రోల్ చేయడం ప్రారంభించారు.

Also Read :

బిగ్ బాస్ బ్యూటీ కి చేదు అనుభవం..!

2022 లో ప్రపంచ వ్యాప్తంగా మైండ్ బ్లాక్ కలెక్షన్లు రాబట్టిన 4 సినిమాలు….!

Visitors Are Also Reading