Home » 2022 లో ప్రపంచ వ్యాప్తంగా మైండ్ బ్లాక్ కలెక్షన్లు రాబట్టిన 4 సినిమాలు….!

2022 లో ప్రపంచ వ్యాప్తంగా మైండ్ బ్లాక్ కలెక్షన్లు రాబట్టిన 4 సినిమాలు….!

by AJAY
Ad

ప్రస్తుతం సౌత్ సినిమాల హవా కనిపిస్తోంది. ఒకప్పుడు సినిమా తీస్తే 100 కోట్ల కలెక్షన్ వచ్చాయంటే ఆ సినిమా బ్లాక్బస్టర్ అనేవాళ్ళు. కానీ ఇప్పుడు సినిమా తీయడానికే వందల కోట్లు ఖర్చు చేసి తీస్తున్నారు. దాంతో పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేసి మొదటిరోజే వంద కోట్లకు పైగా కలెక్షన్లను కూడా రాబడుతున్నారు. ఇక ఈ ఏడాది కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు విడుదలయ్యాయి. ఈ చిత్రాల మొదటి రోజు కలెక్షన్లు చూస్తే దిమ్మతిరిగిపోయేలా ఉంది. అలా ఈ ఏడాది ఫస్ట్ డే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇప్పుడు చూద్దాం…

Advertisement

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా మొదటి రోజే రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమాకు ఏకంగా రూ.223 కోట్ల వసూలు వచ్చాయి.

Advertisement

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ స్టార్ యష్ నటించిన సినిమా కేజిఎఫ్ చాప్టర్-2. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు మొదటి రోజే 120 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన సినిమా బీస్ట్. ఈ సినిమా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు మొదటి రోజే రూ.88 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా రాధే శ్యామ్. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు మొదటి రోజే 79 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

Also read :

సమంతను నమ్ముకుంటే ఇలా జరిగిందేంటి…తెలుగు రాష్ట్రాల్లో ఒక్క టికెట్ కూడా…!

“ఆచార్య” లో యంగ్ చిరు దర్శనం….ఇదెక్కడి వీఎఫ్ఎక్స్ బాబోయ్ అంటూ నెట్టింట ట్రోల్స్…!

Visitors Are Also Reading