Home » కంగ్రాట్స్ రేవంత్.. నెట్టింట జోరుగా శుభాకాంక్షలు..!

కంగ్రాట్స్ రేవంత్.. నెట్టింట జోరుగా శుభాకాంక్షలు..!

by Anji
Published: Last Updated on
Ad

తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం ఎవ్వరూ అవుతారు అని రెండు రోజుల పాటు ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ, హైదరాబాద్ లో రెండు రోజుల పాటు రాజకీయాలు నడిచాయి. చివరికీ ఢిల్లీ పెద్దలు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని సీఎల్పీనేతగా ప్రకటించారు. రేవంత్ రెడ్డిని ఎప్పుడైతే తెలంగాణ సీఎంగా ప్రకటించారో సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి. రేవంత్ రెడ్డికి పలువురు ట్వీట్స్ చేశారు. రేవంత్ రెడ్డి కూడా సోనియాగాంధీకి, రాహుల్ గాంధీకి,  మల్లి కార్జున ఖర్గే, కేసీ వేణు గోపాల్, థాక్రె, డీ.కే.శివకుమార్ వంటి తదితర సీనియర్ నాయకులకు  కృతజ్ఞతలు తెలిపారు. 

Advertisement

తెలంగాణ రాష్ట్ర రెండో సీఎంగా రేవంత్ రెడ్డి ఈనెల 7న పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఆయన వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపించింది. సీఎంగా రేవంత్ రెడ్డి పేరుని కాంగ్రెస్ ప్రకటించడంతో సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వస్తున్నాయి. రేవంత్ ప్రస్తావన తొలి నుంచి సీఎంగా ఎదిగిన తీరును గుర్తు చేసుకుంటున్నారు. అయితే సోషల్ మీడియాలోనే కాదు.. రేవంత్ రెడ్డి స్వగ్రామంలో కూడా సంబరాలు అంబరాన్ని అంటాయి. రేవంత్ రెడ్డి ప్రాతినిత్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో ఒక్కసారిగా పండుగ వాతావరణం నెలకొంది. హైదరాబాద్ లోని రేవంత్ రెడ్డి నివాసం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు.  రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం గురించి పలువురు నెట్టింట్లో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. నా అన్న రేవంత్ కి శుభాకాంక్షలు అంటూ  సీతక్క ట్వీట్ చేసింది.  సినీ నటుడు మనోజ్ కూడా శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

సోషల్ మీడియాలో ఇవాళ రేవంత రెడ్డి హాట్ టాపిక్ గా మారారు. రేవంత్ రెడ్డి గురించి సెర్చ్ చేయడం ప్రారంభించారు. రేవంత్ రెడ్డి 1969 నవంబర్ 08న నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డి పల్లిలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు అనుముల నర్సింహారెడ్డి, అనుముల రామచంద్రమ్మలు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి రేవంత్ రెడ్డి బీఏ గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు. రేవంత్ రెడ్డికి తొలుత ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. ఆయన సామాన్య కార్యకర్త నుంచి సీఎంగా ఎదిగారు. తొలుత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మిడ్జిల్ మండలం నుంచి 2007లో జడ్పీటీసీ స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. గెలుపు పార్టీలన్నీ ఒక్కసారిగా రేవంత్ వైపు చూసేవిధంగా చేసింది. ఆ తరువాత ఎమ్మెల్యేగా గెలవడంతో అప్పటికే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావాలని ఆహ్వానించినా.. దివంగత సీఎం ఎన్టీఆర్.. మాజీ సీఎం చంద్రబాబు నాయుడిపై  ఉన్న అభిమానంతో రేవంత్ రెడ్డి టీడీపీలో చేరారు. తెలంగాణ వచ్చిన తరువాత టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి కీలక నేతగా ఎదిగారు.

 

Visitors Are Also Reading