Home » Chanakya Niti : మ‌నిషి సంపాద‌న ఈ నాలుగు విధాలుగా ఖ‌ర్చు చేయాలట‌

Chanakya Niti : మ‌నిషి సంపాద‌న ఈ నాలుగు విధాలుగా ఖ‌ర్చు చేయాలట‌

by Anji
Ad

ఆచార్య చాణ‌క్యుడు మౌర్య‌వంశ స్థాప‌కుడిగా ప్ర‌సిద్ధి చెందాడు. చాణ‌క్యుడు గొప్ప దౌత్య‌వేత్త రాజ‌కీయ వేత్త‌, ఆర్థ‌క‌వేత్త‌, సామాజిక వేత్త‌, చాణ‌క్యుడు త‌న తెలివితేట‌ల‌తో నంద‌వంశాన్ని నాశ‌నం చేసి సాధార‌ణ పిల్ల‌వాడైన చంద్ర‌గుప్తుని సింహాస‌నంపై కూర్చొబెట్టారు. చాణ‌క్యుడు చిన్న‌త‌నం నుంచే త‌న జీవితంలో చాలా స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కున్నాడు. త‌న జీవ‌తానుభ‌వాల‌ను నీతిశాస్త్రంలో పేర్కొన్నారు. మ‌నిషి జీవన విధానం గురించి చాణ‌క్యుడు నీతిలో పేర్క‌న్నాడు మ‌నిషి ఎప్పుడు ఎలా ఖ‌ర్చు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

Also Read : స‌ర్కారు వారి పాట నుంచి క‌ళావ‌తి సాంగ్ విడుద‌ల

జ‌బ్బు ప‌డిన వ్య‌క్తుల‌కు స‌హాయం


ఆచార్య చాణ‌క్యుడు మ‌నిషి సాధ్య‌మైనంత వ‌ర‌కూ అనారోగ్యంతో ఉన్న వ్య‌క్తుల‌కు త‌మ శ‌క్తి కొల‌ది డ‌బ్బు సాయం చేయాల‌ని పేర్కొన్నాడు. ఇలా వ్యాధి గ్ర‌స్తుల‌కు సాయం చేయ‌డం ఆ వ్య‌క్తి గౌర‌వాన్ని పెంచుతుంది. అంతేకాదు అటువంటి వ్య‌క్తి ప‌ట్ల దేవుడు క‌రుణ క‌లిగి ఉంటాడు. అనారోగ్యంతో ఉన్న‌వారికి స‌హాయం చేయ‌క‌పోతే అనంత‌రం ఏదైనా చెడు జ‌రిగిన‌ప్పుడు ఆ వ్య‌క్తి ప‌శ్చాత్తాప ప‌డాల్సి ఉంటుంది.

పేద‌ల‌కు స‌హాయం

Advertisement

నిరుపేద‌ల‌కు స‌హాయం చేస్తే పుణ్యం క‌లుగుతుంద‌ని చాణ‌క్య నీతిలో ప్ర‌త్యేకంగా పేర్కొన్నారు. నిజంగా అవ‌స‌ర‌మైన వ్య‌క్తుల‌కు డ‌బ్బు ఖ‌ర్చు చేయ‌డానికి ఎప్పుడూ వెనుకంజ వేయ‌కూడ‌దు అని చెప్పాడు. ముఖ్యంగా పేద పిల్ల‌ల‌కు చ‌దువు చెప్పేందుకు విరాళం ఇవ్వ‌గ‌లిగిన వ్య‌క్తి ప‌ట్ల దేవుడు క‌రుణ క‌లిగి ఉంటాడు.

సామాజిక సేవ

ప్ర‌తి ఒక్క‌రూ త‌మ ఆదాయంలో కొంత భాగాన్ని సామాజిక సేవ చేయ‌డానికి క‌చ్చితంగా ఖ‌ర్చు చేయాల‌ని చాణ‌క్యుడు పేర్కొన్నాడు. ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకొచ్చేవిదంగా ఆసుప‌త్రి, పాఠ‌శాల వంటి నిర్మాణం కోసం ఖ‌ర్చు చేయ‌డం ద్వారా ఆ వ్య‌క్తి కీర్తి ప్ర‌తిష్ట‌లు పెరుగుతాయ‌యి. అలా చేసిన సాయం పొందిన వారు సంతోషంగా ఉంటారు.

మ‌త ప‌ర‌మైన ప్ర‌దేశాల‌కు విరాళం


ఏదైనా మ‌త ప‌ర‌మైన ప్ర‌దేశాల‌కు దానం చేయ‌డానికి ఎప్పుడు వెన‌కడుగు వేయ‌కూడ‌దు అని, అలా చేయ‌డం వ‌ల్ల పుణ్యం ల‌భిస్తుంద‌ని జీవితంలో సానుకూల‌త వ‌స్తుంద‌ని చాణ‌క్య నీతిలో పేర్కొన‌బ‌డింది ఇలా చేయ‌డం వ‌ల్ల మీ కుటుంబంలో శాంతి, సంతోషం, ఐశ్వ‌ర్యం కూడా పెరుగుతాయి.

Also Read :  వాడికి పనిస్తే…మాకు ఈ పని చేశాడు…తమన్ ఎమోషనల్…!

Visitors Are Also Reading