Home » స‌ర్కారు వారి పాట నుంచి క‌ళావ‌తి సాంగ్ విడుద‌ల

స‌ర్కారు వారి పాట నుంచి క‌ళావ‌తి సాంగ్ విడుద‌ల

by Anji

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ హీరో మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం చేస్తున్న సినిమా స‌ర్కారు వారి పాట ఈ సినిమాకు స్టార్ ద‌ర్శ‌కుడు ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. పొలిటిక‌ల్ అండ్ మాస్ బ్యాక్ డ్రాప్‌లో తెర‌కెక్కుతోంది. ఇక ఈ సినిమాలో మ‌హేష్‌బాబు మ‌హానటి కీర్తి సురేష్ న‌టిస్తు్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు న‌వీన్ ఎర్నేనీ, వై.ర‌విశంక‌ర్, గోపి అచంట నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తూ ఉన్నారు. ఇక మైత్రి మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై ఈ సినిమా తెర‌కెక్కుతుంది.

Also Read :  కేసీఆర్ పుట్టిన‌రోజు.. టీఆర్ఎస్ కీల‌క నిర్ణ‌యం..!

ఇది ఇలా ఉండ‌గా స‌ర్కారు వారి పాట నుంచి అదిరిపోయే అప్‌డేట్‌ను తాజాగా వ‌చ్చింది. ఇటీవ‌లే ఫిబ్ర‌వ‌రి 14న ప్రేమికుల దినోత్స‌వం సంద‌ర్భంగా విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించ‌డంతో ఫిబ్ర‌వ‌రి 12 న ఈ సాంగ్‌ను లీక్ చేయ‌డంతో ఇద్ద‌రినీ అరెస్ట్ కూడా చేసిన విష‌యం తెలిసిందే.

ఈ మేర‌కు ఇవాళ వీడియో సాంగ్ విడుద‌ల చేసింది చిత్ర బృందం. ఇందులో మ‌హేష్ బాబు చాలా హ్యాండ్ స‌మ్‌గా క‌నిపిస్తున్నాడు. హీరోయిన్ కీర్తి సురేష్ కూడా చాలా అందంగా క‌నిపిస్తోంది. మొత్తానికి ఈ పాట‌లో మ‌హేస్‌, కీర్తి సురేష్ మ‌ధ్య కెమిస్ట్రీ బాగా వ‌ర్క‌వుట్ అయింది. మే 12న స‌ర్కారు వారి పాట సినిమాను విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ఇటీవ‌లే చిత్ర బృందం ప్ర‌క‌టించింది.

https://youtu.be/Vbu44JdN12s

Visitors Are Also Reading