Home » పొలిటికల్ ఎంట్రీ కోసమే మనోజ్ పెళ్లి చేసుకున్నారా..? కౌంటర్ మామూలుగా లేదుగా..!

పొలిటికల్ ఎంట్రీ కోసమే మనోజ్ పెళ్లి చేసుకున్నారా..? కౌంటర్ మామూలుగా లేదుగా..!

by Anji
Ad

టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ ఇటీవల కుటుంబ సభ్యుల సమక్షంలో భూమా మౌనికరెడ్డిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. మంచు మనోజ్ మౌనికారెడ్డిని పెళ్లి చేసుకోవడం వెనుక మరో కారణం దాగి ఉందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రధానంగా పొలిటికల్ ఎంట్రీ కోసమే మనోజ్ ఈవిధంగా చేసి ఉండవచ్చనే కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయంలో మనోజ్ సింపుల్ గా ఓ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. పొలిటికల్ ఎంట్రీపై కూడా క్లారిటీ ఇచ్చేశారు.  

Also Read :  సోనాలి బింద్రే నుండి సమంత వరకు ప్రాణాంతక వ్యాధులతో పోరాడి గెలిచిన మహిళా నటీమణులు..!!

Advertisement

మనోజ్ తన మొదటి భార్య నుంచి విడాకులు తీసుకున్న తరువాత చాలా కాలం సింగిల్ గానే ఉన్నారు. తన ప్రేమ విషయం మాత్రం ఎక్కడ కూడా బయటపెట్టలేదు మనోజ్. భూమా మౌనికతో ప్రేమలో ఉన్న విషయం ఇండస్ట్రీలో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈ విషయాన్ని మనోజ్ అధికారికంగా పెళ్లి వార్తతో తెలియజేశారు. హిందూ సాంప్రదాయ పద్దతిలో మనోజ్-మౌనిక ఒక్కటై.. ఏడడుగులు నడిచారు. 

Advertisement

Also Read :  శోభన్ బాబు ఆస్తుల విలువ ఎంతో తెలుసా.. ఇప్పటి తరం హీరోలు కూడా అందుకోలేరు..!!

వీరిద్దరికీ సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అంతేకాదు.. భూమా ఫ్యామిలీ చాలా కాలంగా రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నారు. మంచు మనోజ్ కూడా ఇప్పుడు వారి అమ్మాయిని పెళ్లి చేసుకొని అటువైపు అడుగులు వేసే అవకాశాలున్నట్టుగా టాక్ అయితే వినిపిస్తోంది. గతంలో పలు రాజకీయ అంశాలపై మనోజ్ స్పందించిన విషయం విధితమే. ఇక అప్పటి నుంచే మనోజ్ పాలిటిక్స్ లోకి రావాలనుకుంటున్నట్టు పలు కథనాలు వెలువడుతున్నాయి.  

Also Read :  శ్రీమంతుడు నుంచి బలగం వరకు కాపీ ఆరోపణలు ఎదుర్కొన్న చిత్రాలు ఇవే..!

Visitors Are Also Reading