Home » రాజకీయాల్లోకి మంచు మనోజ్.. అప్పుడే ఆ పార్టీలో చేరబోతున్నారా..?

రాజకీయాల్లోకి మంచు మనోజ్.. అప్పుడే ఆ పార్టీలో చేరబోతున్నారా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ఎన్నో నెలల ఉత్కంఠకు తెరపడింది. మంచు మనోజ్ భూమా మౌనికల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు కూడా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. మార్చి మూడు శుక్రవారం రాత్రి 8 గంటల 30 నిమిషాలకు శుభ ముహూర్తాన భూమా మౌనిక మెడలో మంచు మనోజ్ మూడు ముళ్ళు వేశారు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు మరియు వారి గురించి తెలియని వార్తలు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వినిపిస్తూనే ఉన్నాయి.

Advertisement

Also Read:బిచ్చగాడు మూవీ మిస్ చేసుకున్న తెలుగు హీరో ఎవరంటే..?

తాజాగా ఒక వార్త చక్కర్లు కొడుతోంది. మంచు మనోజ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారని.. మరి ఆయన ఏ పార్టీలో చేరుతారో అనే విశేషాలు చూద్దాం.. మంచు మనోజ్ తన పెళ్లి తర్వాత ఒక రోజు ఇంట్లో ఉండి ఆ తర్వాత కర్నూలు బయలుదేరారు. ఆయన వెళ్లే దారిలో ఒక రాజకీయ నాయకుడికి ఏ విధమైన బందోబస్తు ఉంటుందో ఆ విధమైన కాన్వాయ్ లతో కర్నూలు చేరుకున్నారు.

Advertisement

Also Read:ఆ వయసులో ఉన్నప్పుడు మా నాన్నే నన్ను అలా వేధించాడంటూ..కామెంట్స్ చేసిన కుష్బూ..!!

దీన్నిబట్టి చూస్తే మంచు మనోజ్ భూమ మౌనిక త్వరలో క్రియాశీలక రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారని అర్థమవుతుంది. అయితే భూమా మౌనికకు రాజకీయాలంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా మనం చెప్పుకోనక్కర్లేదు. ఈమెకు మంచు మనోజ్ కూడా అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఈ కారణం వల్లే మంచు మనోజ్ కూడా రాబోయే రోజుల్లో రాజకీయాల్లోకి వస్తాడని వార్తలు జోరందుకున్నాయి.

ఇంతకీ ఈ కొత్త దంపతులు టిడిపి పార్టీ నుంచి పోటీ చేస్తారా.. లేదంటే తండ్రి కొనసాగుతున్న వైసిపి పార్టీ నుంచి పోటీ చేస్తారా.. అనేది ప్రస్తుతం సస్పెన్స్ లో ఉంది. మరి వీరు ఏ రాజకీయ పార్టీ లో కొనసాగుతారో అనే విషయం గురించి మనకు ముందు ముందు తెలుస్తుంది. మరి వీరు ఏ పార్టీలో చేరుతారో మీరు మీ కామెంట్ ద్వారా తెలియజేయండి.

Also Read:నిశ్చితార్థం తర్వాత తమ పెళ్లిని రద్దు చేసుకున్న 10 మంది సినీ నటులు వీరే..!

Visitors Are Also Reading