Telugu News » Blog » నిశ్చితార్థం తర్వాత తమ పెళ్లిని రద్దు చేసుకున్న 10 మంది సినీ నటులు వీరే..!

నిశ్చితార్థం తర్వాత తమ పెళ్లిని రద్దు చేసుకున్న 10 మంది సినీ నటులు వీరే..!

by Anji
Published: Last Updated on
Ads

పెళ్లి అంటే నూరేళ్ల పంట. భార్య, భర్తలు సుఖ, సంతోషాలతో నిండు నూరేళ్లు ఆయురోరాగ్యాలతో కలిసి మెలిసి ఉండాలని పెళ్లి రోజు పెద్దలు, బంధువులు, కుటుంబ సభ్యులు అందరూ ఆశీర్వదిస్తారు. చేసుకున్న ప్రతీ ఒక్కరూ అలా ఉండలేరు. కొంత మంది పెళ్లి చేసుకొని జీవితాతం కలిసి మెలిసి ఉంటే.. మరికొందరూ పెళ్లి చేసుకున్న తరువాత మధ్యలోనే విడిపోతారు. మరికొందరూ అయితే పెళ్లి కాకుండా నిశ్చితార్థం జరిగిన తర్వాత కూడా విడిపోయిన వారు చాలా మంది ఉన్నారు. సాధారణ వ్యక్తుల్లో ప్రముఖులలో కూడా ఇలా జరిగింది. అయితే నిశ్చితార్థం జరిగిన తరువాత పెళ్లిని రద్దు చేసుకున్న 10 మంది ప్రముఖుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

Also Read :  మ‌నోజ్ పెళ్లిలో విష్ణు తీరు చూసి అవాక్కవుతున్న నెటిజ‌న్లు..ఇలా చేశావేంటి అంటూ ఫైర్.?

 

అక్షయ్ కుమార్- రవీనా టాండన్ :

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ హీరోయిన్ రవీనా టాండన్ ని పెళ్లి చేసుకోవాలని సిద్ధమయ్యాడు. కుటుంబ సభ్యులు, బంధు, మిత్రుల సమక్షంలో నిశ్చితార్థం జరిగింది. కానీ అతడితో సెటిల్ అవ్వాలని భావించిన రవీనా ఏకంగా అతని కోసం బాలీవుడ్ నుంచి తప్పుకోవడానికి సిద్ధమైంది. వీరిద్దరూ గొడవలతో విడిపోయారు.  ఇక ఆ తర్వాత మరో హీరోయిన్ ట్వింకిల్ ఖన్నాను పెళ్లి చేసుకున్నాడు అక్షయ్ కుమార్. 

Also Read :  ఆ మూడింటిని వారికి ఇవ్వండి అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసిన శ్రీలీలా..!!

సల్మాన్ ఖాన్ -సంగీతా బిజ్లానీ :

Manam News

బాలీవుడ్ కండల వీరుడు హీరో సల్మాన్ ఖాన్ సంగీతా బిజ్లానీతో కొంత కాలం ప్రేమ కొనసాగించాడు. వీరిద్దరూ పెళ్లి కూడా  చేసుకోవాలనుకున్నారు. సల్మాన్ ఖాన్ సంగీతా బిజ్లానీతో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆమె మిస్ ఇండియా టైటిల్ విజేత కూడా. ఏమైందో ఏమో కానీ వీరిద్దరూ తమ నిశ్చితార్థాన్ని విరమించుకున్నారు. ఇక ఇప్పటికీ కూడా స్నేహపూర్వకంగానే ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు సల్మాన్ మళ్లీ పెళ్లి గురించి మాట్లాడలేదు. 

అభిషేక్ బచ్చన్- కరిష్మా కపూర్ :

బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ హీరోయిన్ కరిష్మా కపూర్ తో దాదాపు ఆరేళ్ల పాటు డేటింగ్ కొనసాగించాడు. వీరిరువురు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. చాలా సంతోషంగా నిశ్చితార్థం చేసుకున్నారు. అభిషేక్ తండ్రి అమితాబ్ బచ్చన్ ఇద్దరి సంబంధంతో సంతోషంగా లేరని.. దీంతో పెళ్లిని విరమించుకున్నారని కథలు వినిపించాయి. కరిష్మా ఎప్పుడూ అభిషేక్ బచ్చన్ తో ఘర్షణ పడుతూ కనిపించేదని ఓ ప్రముఖ నిర్మాత కూడా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. వీరి బంధం బలహీనంగా ఉండడంతో ఐశ్వర్యరాయ్-అభిషేక్ బచ్చన్ పెళ్లి చేసుకున్నట్టు సమాచారం. 

Also Read :  “బలగం” వివాదంపై జబర్దస్త్ వేణు క్లారిటీ.. అసలు కథ ఎవరిదంటే ?

సనమ్ శెట్టి- తర్షన్ :

Manam News

Advertisement

తమిళ బిగ్ బాస్ సీజన్ 3 తర్వాత మంచి పేరు తెచ్చుకున్న సనమ్ శెట్టి & తర్షన్ ఈ షో తరువాత వీరు నిశ్చితార్థం చేసుకున్నారు. మధ్యలో వీరి మధ్య మనస్పార్థాలు చోటు చేసుకోవడం.. గొడవలు జరిగాయి. కొన్ని ఆరోపణల కారణంగా చీటింగ్ కేసు నమోదు  కావడంతో పాటు కోర్టు వరకు వెళ్లారు. దీంతో వీరి పెళ్లి ఆగిపోయింది. 

ఉదయ్ కిరణ్- సుష్మిత :

Manam News

తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యాడు ఉదయ్ కిరణ్. అప్పట్లో ఈ సినిమా సూపర్ హిట్ సాధించడంతో వరుస సినిమాల్లో నటించేందుకు అవకాశం వచ్చింది. వచ్చిన సినిమాలలో కొన్ని సూపర్ డూపర్ హిట్ సాధించాయి. మనసంతానువ్వే, నువ్వునేను చిత్రాలతో ఉదయ్ కిరణ్ లైఫ్ ఒక్కసారిగా టర్న్ అయిపోయింది. ఏకంగా 11 పెద్ద బ్యానర్లు ఉదయ్ కిరణ్ కి అవకాశమిచ్చారు. ఈ సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుష్మితతో నిశ్చితార్థం జరిగింది. వ్యక్తి గత కారణాలతో వారి పెళ్లి ఆగిపోయింది. 

త్రిష-వరుణ్ :

Manam News

తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో 70కి పైగా సినిమాలను చేసిన త్రిష సౌత్ లోనే టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది. సౌత్ కథానాయిక త్రిష బిజినెస్ మెన్, నిర్మాత, తన చిన్ననాటి స్నేహితుడు వరుణ్ మణియన్ తో నిశ్చితార్థం జరిగింది. కొన్ని కారణాల వల్ల వీరి పెళ్లి రద్దు అయింది. ఆ తరువాత త్రిష మళ్లీ పెళ్లి మాటనే ఎత్తలేదు.

మెహ్రీన్ పిర్జాదా-భవ్య బిష్ణోయ్ : 

Manam News

మెహ్రీన్ పిర్జాదా F3 ఫేమస్ హీరోయిన్. తెలుగు, తమిళంలో రెండు సినిమాలతో బిజీగానే ఉంది. సుప్రసిద్ధ రాజకీయ కుటుంబానికి చెందిన భవ్య బిష్ణోయ్ తో నిశ్చితార్థం జరిగింది. కొన్ని వ్యక్తి గత కారణాల వల్ల వీరి పెళ్లి ఆగిపోయింది. 

Also Read :  గంగ‌వ్వ ఇంటినిర్మాణానికి నాగార్జున ఎన్ని ల‌క్ష‌లు ఇచ్చాడో తెలుసా..?

రష్మిక- రక్షిత్ శెట్టి :

Manam News

కన్నడ సెన్షేషనల్ నటులు రష్మిక మందన్న,రక్షిత్ శెట్టి ఇద్దరూ కిరిక్ పార్టీ సినిమాకి పని చేసిన తరువాత వీరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వీరు పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. వీరి ప్రేమ నిశ్చితార్థం వరకు వెళ్లింది. కానీ కొద్ది రోజుల్లో పెళ్లి జరగాల్సిన సమయంలో ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. వీరు పెళ్లిని మాత్రం రద్దు చేసుకున్నారు. 

 విశాల్- అనీషా అల్లారెడ్డి :

Manam News

తమిళ హీరో విశాల్ కి నటి అనీషా  అల్లారెడ్డితో నిశ్చితార్థం జరిగిన విషయం విధితమే. వారు పెళ్లి చేసుకోవడమే ఆలస్యం అనుకునేంత లోపే వారి పెళ్లిని రద్దు చేసుకున్నట్టు ప్రకటించారు. ఇక ఆ తరువాత విశాల్ పలువురితో ప్రేమలో ఉన్నాడని రూమర్స్ వినిపించాయి. 

అఖిల్ -శ్రియా భూపాల్ :

అక్కినేని నాగార్జున రెండో కుమారుడు అఖిల్ ఎంగేజ్ మెంట్ అయిపోయి వెన్యూకి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలోనే అకస్మాత్తుగా క్యాన్సిల్ అయింది. అక్కినేని అఖిల్, జీవీకే మనువరాలు శ్రీయా భూపాల్ కి పెళ్లి కుదిరింది. పెళ్లి రద్దు కావడంతో రకరకాల ఊహగానాలు వినిపించాయి. ముఖ్యంగా అఖిల్, శ్రియా భూపాల్ మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతోనే పెళ్లిని క్యాన్సల్ చేసుకున్నట్టు సమాచారం.

Advertisement

Also Read :  ఒక‌ప్ప‌టి స్టార్ హీరోయిన్ లైలా ఇప్పుడు ఎలా ఉందో తెలుసా…? ఏం చేస్తుందంటే.?

You may also like