Home » మౌనిక మొదటి పెళ్లికి మంచు మనోజ్… అక్కడే పడేశాడా?

మౌనిక మొదటి పెళ్లికి మంచు మనోజ్… అక్కడే పడేశాడా?

by Bunty
Ad

టాలీవుడ్ సినీ నటుడు మంచు మనోజ్ మరోసారి వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నాడు. దివంగత రాజకీయ నేతలైన భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల రెండో కుమార్తె భూమా మౌనిక రెడ్డిని ఆయన పెల్లాడబోతున్నాడు. వీరి వివాహం ఈ రాత్రి 8:30 గంటలకు జరగనుంది. ఈ నేపథ్యంలో తనకు కాబోయే భార్య మౌనిక ఫోటోను సోషల్ మీడియాలో మనోజ్ పోస్ట్ చేశాడు ‘పెళ్లికూతురు భూమా మౌనిక’ అని ట్వీట్ చేశాడు. ఈ పోస్ట్ చూసిన సినీ ప్రియులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

READ ALSO : చైనాలో 40 కోట్లకు పైగా పెళ్లి కాని ప్రసాద్ లు… కారణం ఇదే!

Advertisement

Advertisement

తన సోదరీ మంచు లక్ష్మి నివాసంలో ఈ పెళ్లి జరగనుంది. ఈ పెళ్లికి సంబంధించి రెండు కుటుంబాలకు చెందిన వారు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కొన్నాళ్లపాటు వీరిద్దరూ కలిసి రిలేషన్షిప్ చేసిన తర్వాత పెళ్లి వైపు అడుగులు వేశారు. వీరిద్దరికీ ఇది రెండో వివాహమే. అయితే మౌనిక మొదటి పెళ్లికి మంచు మనోజ్ అతిథిగా వెళ్లారని, ఇప్పుడు ఆమెని ఆయన రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

READ ALSO : బాబోయ్ లడ్డు బాబుల మారిన సుధీర్ బాబు… ఫోటో చూశారా?

2017లో మౌనికకు పెళ్లయింది. ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. వీరి పెళ్లికి మంచు మోహన్ బాబు ఒప్పుకోలేదని, అందుకనే మనోజ్, మౌనికలు చాలా రోజులపాటు ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారనేది కూడా ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఫిల్మ్ నగర్ లోని మంచు లక్ష్మీ ఇంట్లోనే మనోజ్, మౌనికల పెళ్లి జరుగుతుందని బయట వినిపిస్తున్న సమాచారం.

READ ALSO : IND VS AUS : ఓటమి ముంగిట ఇండియా.. రోహిత్ చేసిన ఈ 3 తప్పిదాలు ఇవే

Visitors Are Also Reading