Home » చైనాలో 40 కోట్లకు పైగా పెళ్లి కాని ప్రసాద్ లు… కారణం ఇదే!

చైనాలో 40 కోట్లకు పైగా పెళ్లి కాని ప్రసాద్ లు… కారణం ఇదే!

by Bunty
Ad

పెళ్లి, అనేది ఓ మధురమైన అనుభూతి. అయితే వివాహం, అనేది తగిన వయసులో జరిగితేనే, దానికో అర్థం ఉంటుంది. కానీ చాలామంది ఏజ్ బార్ అయ్యాక పెళ్లి చేసుకుంటారు. ముఖ్యంగా 30 సంవత్సరాలు దాటిన తర్వాత పెళ్లి చేసుకుంటే అనేక ఇబ్బందులు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కానీ చైనాలో 35 దాటిన పెండ్లి కాని వారి సంఖ్య పెరుగుతోందని తేలింది. నగరాల్లోని యువత ఒంటరి జీవితాన్ని ఎంపిక చేసుకుంటే, గ్రామీణ ప్రాంత యువతను పెళ్లి చేసుకోవడానికి వధువులు పెద్దగా ఆసక్తి చూపడం లేదని చైనీస్ వెబ్సైట్ విబో పేర్కొంది.

READ ALSO : ఉప్పెన సినిమా కథను.. వినకుండానే రిజెక్ట్ చేసిన హీరో ఎవరో తెలుసా?

Advertisement

Advertisement

ఈ సర్వేలో తేలిన వివరాల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 30, ఏళ్లు దాటిన పురుషులు పెళ్లి ప్రయత్నాలపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. చైనీస్ ప్రభుత్వ లెక్కల ప్రకారం 2022 నాటి పెళ్లి కాని పెద్దవారి సంఖ్య 40 కోట్లకు చేరింది. ఇదిలా ఉంటే చైనాలో విడాకుల రేటు కూడా పెరుగుతుండడం గమనార్హం. ఒంటరిగానే జీవించడానికి చాలామంది యువకులు భావిస్తున్నట్లు సర్వేలో తేలింది. ఇక చైనాలో జనాభా తగ్గడం కూడా ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. దీంతో డ్రాగన్ కంట్రీ దిద్దుబాటు చర్యలకు పూనుకుంది.

READ ALSO : టిడిపి బిగ్ స్కెచ్.. మంత్రి రోజాపై పోటీకి అలేఖ్య రెడ్డి రెడీ ?

2016లో ఏకైక సంతానం నిబంధనలకు స్వస్తి చెప్పి ఇద్దరు పిల్లలను కనేందుకు అనుమతి ఇచ్చింది. దీనివల్ల కూడా ఆశించిన ఫలితం లేకపోవడంతో 2021 లో ముగ్గురు పిల్లలకు అనుమతి ఇచ్చింది. అయినా పెళ్లి అంటే యువత భయపడుతోంది. అయితే ప్రభుత్వం కూడా జనాభా పెరుగుదలకు ముమ్మరంగా చర్యలు చేపడుతోంది. పెళ్లి చేసుకున్న యువతకు 30 రోజులపాటు జీవితంతో కూడిన సెలవులు ఇచ్చే విధానాన్ని అమలు చేసింది.

READ ALSO : నందమూరి కుటుంబంలో ఇన్ని చీకటి కోణాలు ఉన్నాయా…?

Visitors Are Also Reading