Home » కాంతార సినిమాలో హీరో తల్లి పాత్రలో నటించిన నటి ఎవరో తెలుసా ?

కాంతార సినిమాలో హీరో తల్లి పాత్రలో నటించిన నటి ఎవరో తెలుసా ?

by Bunty
Ad

కన్నడ దర్శకుడు రిషబ్ శెట్టి హీరోగా నటించిన స్వయంగా దర్శకత్వం వహించిన చిత్రం కాంతారా. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సినిమా తోలుత కేవలం కన్నడంలో మాత్రమే విడుదల అయింది. ఆ తర్వాత కన్నడంతో పాటు హిందీ, తెలుగు, తమిళం, మలయాళం వంటి భాషల్లో విడుదలై దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది.

ఇవి కూడా చదవండిKangana Ranaut : చంద్రముఖిగా మారనున్న కాంట్రావర్సీ క్విన్.. లారెన్స్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ..

Advertisement

manasi-sudhir

 

ఇకపోతే ఈ సినిమాలో రిషబ్ శెట్టి తల్లి పాత్రలో నటించిన ఆమె ఎవరు అన్న విషయంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చలు కొనసాగుతున్నాయి. దీంతో ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసుకునే పనిలో పడ్డారు నెటిజన్స్. అలాగే ఆమె ఇంతకుముందు ఏదైనా సినిమాలలో నటించిందా అన్న విషయాల పట్ల కూడా ఎంక్వైరీ చేశారు. ఈ నేపథ్యంలోని ఆమెకు సంబంధించిన కొన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి.

ఆమె పేరు మానసి సుధీర్. లాక్ డౌన్ సమయంలో ఆమె సోషల్ మీడియా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల కాలంలో తల్లి పాత్రలకు ఎక్కువగా ప్రాధాన్యత పెరుగుతున్న విషయం తెలిసిందే. ఇక కాంతారా సినిమాలో మానసి సుధీర్ కమల అనే పాత్రలో నటించి తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. అయితే ఆమె మామూలుగా ఉపాధ్యాయులు కాగా, లాక్ డౌన్ సమయంలో యూట్యూబ్ ఛానల్ ద్వారా తన పిల్లలకు పాఠాలను బోధించింది.

READ ALSO : హీరోయిన్ చాందిని చౌదరికి వాట్సాప్ లో వేధింపులు.. ఫొటోస్ వైరల్

Visitors Are Also Reading