Home » Kangana Ranaut : చంద్రముఖిగా మారనున్న కాంట్రావర్సీ క్విన్.. లారెన్స్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ..

Kangana Ranaut : చంద్రముఖిగా మారనున్న కాంట్రావర్సీ క్విన్.. లారెన్స్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ..

by Bunty
Ad

రజినీకాంత్ కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రాలలో చంద్రముఖి సినిమా కూడా ఒకటి. ఈ సినిమా 2005లో విడుదలై మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక ఈ చిత్రంలో నయనతార, జ్యోతిక ఇతర నటీమణులు సైతం ఎంతో అద్భుతంగా నటించారని చెప్పవచ్చు.  దాదాపుగా ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్లీ ఈ సినిమా సీక్వెల్ తెరకెక్కించబోతున్నారు.

Advertisement

అందుకు దర్శకత్వం పి.వాసునే వ్యవహరిస్తూ ఉన్నారు. హీరోగా రాఘవ లారెన్స్ నటిస్తూ ఉండడం గమనార్హం. అయితే ఇందులో కంగానా చంద్రముఖిగా కనిపించనిందని ఫిల్మ్ సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఇందులో కాంట్రవర్సీ క్వీన్ కంగానా నటిస్తుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగానా రనౌత్ నటించనుంది.

Advertisement

ఈ విషయాన్ని తెలియజేస్తూ కంగానా పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. అలాగే చంద్రముఖి 2 లో లక్ష్మీ మీనన్ ఫిమేల్ లీడ్ రోల్ లో కనిపించబోతుంది. ఫస్ట్ పార్ట్ చంద్రముఖిలో కామెడీ టైమింగ్ తో అందరినీ నవ్వించిన లెజెండరీ కమెడియన్ వడివేలు సీక్వెల్ లో కూడా సందడి చేయబోతున్నాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన పోస్టర్లు సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీని పెంచాయి. ఈ చిత్తానికి ఎమ్.ఎమ్.కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

READ ALSO : హీరోయిన్ చాందిని చౌదరికి వాట్సాప్ లో వేధింపులు.. ఫొటోస్ వైరల్

Visitors Are Also Reading