Home » హీరోయిన్ చాందిని చౌదరికి వాట్సాప్ లో వేధింపులు.. ఫొటోస్ వైరల్

హీరోయిన్ చాందిని చౌదరికి వాట్సాప్ లో వేధింపులు.. ఫొటోస్ వైరల్

by Bunty
Ad

టాలీవుడ్ హీరోయిన్ చాందిని చౌదరి గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. మొదట షాట్ ఫిలిమ్స్ లో నటించిన చాందిని చౌదరి ఆ తర్వాత సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది. వచ్చిన కొత్తలో చేసిన సినిమాలు మాత్రం అంతగా సక్సెస్ ఆమెకు ఇవ్వలేదు. కానీ ఈ కరోనా సమయంలో వచ్చిన కలర్ ఫోటో సినిమా చాందిని చౌదరికి సూపర్ హిట్ ను అందించింది.

Advertisement

ఓటీటీలోనే విడుదలైన ఈ సినిమాతో మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకొని ఇప్పుడు వరుస సినిమాలు చేస్తుంది. కలర్ ఫోటో సినిమాలో నటించిన చాందిని చౌదరికి జాతియ అవార్డు కూడా వచ్చింది. ఇక ఇటీవల సమ్మతమే అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన ఈ చిత్రంలో చాందిని నటించింది. కానీ ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ తెలుగు అమ్మాయి తాజాగా నెటిజనులను అప్రమత్తం చేస్తూ ఓ పోస్ట్ చేసింది.

Advertisement

“నాతో పాటు ఉన్న సహా నటీనటులకు సంబంధించిన పేర్లు, ఫోటోలతో గత కొన్ని నెలల నుండి అంతర్జాతీయ నెంబర్స్ ఉపయోగించి కొంతమంది వ్యక్తులు స్కామ్ కి పాల్పడుతున్నారు. జాగ్రత్తగా ఉండండి. వ్యక్తిగత సమాచారం తెలుసుకోవడం కోసం వాట్సాప్ లో నా పేరు వాడుకుంటూ మెసేజ్ లు పంపిస్తున్నారు. మీ వివరాలను వాళ్లతో పంచుకోకండి” అంటూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో స్క్రీన్ షాట్లను షేర్ చేసింది చాందిని చౌదరి.

ఇవి కూడా చదవండి : కన్నడ ఇండస్ట్రీ బ్యాన్.. లోపల జరిగేది వేరంటూ నోరు విప్పిన రష్మికా మందన్న

Visitors Are Also Reading