Home » పుష్ప 2 లో సమంత స్థానంలో ఆయా బ్యూటీ..!

పుష్ప 2 లో సమంత స్థానంలో ఆయా బ్యూటీ..!

by Azhar
Ad
అల్లు అర్జున్ హీరోగా గత ఏడాది చివర్లో వచ్చిన సినిమా పుష్ప. బన్నీ కెరియర్ లో మొదటి పాన్ ఇండియా సినిమాగా వచ్చిన దీనికి సుకుమార్ డైరెక్టర్ గా ఉన్నారు. ఇంకా ఈ సినిమాపై తెలుగులో అంచనాలు ఎక్కువే ఉన్న.. హిందీలో మాత్రం ఎటువంటి అంచనాలు లేకుండా వెళ్లి సూపర్ హిట్ గా నిలిచింది. దాంతో దీని పార్ట్ 2 కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు.
ఇక సుకుమార్ సినిమా అంటే ఐటం సాంగ్ లేకుండా ఉండదు. ఈ విషయాన్ని ఆయనే గతంలో కూడా కొన్నిసార్లు చెప్పాడు. దానికి తగిన విధంగానే పుష్ప సినిమాలో ఉన్న ఐటం సాంగ్ అనేది మొత్తం దేశాన్ని ఊపేసింది. ఇందులో స్టార్ హీరోయిన్ సమంత కనిపించిన విషయం తెలిసిందే. ఆ పాట అనేది సమంతకు కూడా బాగా హెల్ప్ అయ్యింది.
అయితే ఈ సినిమా పార్ట్ 2 గా వాస్తున పుష్ప 2 లో కూడా ఓ ఐటం సాంగ్ అనేది ఉందట. కానీ ఇందులో సమంత స్థానంలో ఈసారి బాలీవుడ్ బ్యూటీ కనిపించనుంది అని తేలుస్తుంది. ఆమె ఎవరో కాదు.. మలైకా అరోరా. పుష్ప లో కూడా సమంత కాకుండా మొదట బాలీవుడ్ హీరోయిన్స్ ను అడగ్గా వారు నో చెప్పారు. కానీ పుష్ప సాధించిన విజయం తర్వాత పుష్ప 2 లో ఐటం సాంగ్ లో కనిపించడానికి అడిగిన వెంటనే మలైకా ఓకే చెప్పినట్లు తెలుస్తుంది.

Advertisement

Visitors Are Also Reading