Home » మహేష్ డబుల్ బ్లాక్ బస్టర్ సర్ ప్రైజ్.. ఫ్యాన్స్ కి పండుగే..!

మహేష్ డబుల్ బ్లాక్ బస్టర్ సర్ ప్రైజ్.. ఫ్యాన్స్ కి పండుగే..!

by Anji
Ad

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన వరుస సినిమాలతో పుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది పూర్తికాగానే దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించే మూవీలో గ్లోబల్ మూవీలో నటించనున్నాడు మహేష్. ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబు అభిమానులకు ఓ  డబల్ బ్లాక్ బస్టర్ సర్ప్రైజ్ పండగ లాంటి న్యూస్ అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. ఇక మ్యాటర్ లోకి వెళ్తే మహేష్ ప్రతి ఏడాది తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు నాడు మే 31వ తారీకు తన కొత్త సినిమా అప్ డేట్స్ ఇస్తుంటారు అన్న సంగతి తెలిసిందే.

Advertisement

 గత ఏడాది సూపర్ స్టార్  కృష్ణ మరణించిన విషయం విధితమే.  ఆయన మరణించిన తరువాత  వస్తున్న ఈ పుట్టినరోజు  ఇది.  మహేష్ సెంటిమెంట్ పరంగా యధావిధిగా తన కొత్త సినిమా SSMB28 టైటిల్ తో కూడిన ఫస్ట్ గ్లింప్స్ వీడియో రిలీజ్ చేసే ఆలోచనలో  మూవీ మేకర్స్ ఉన్నట్టు సమాచారం. ఈ సినిమాను దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నారు. ఆల్రెడీ వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే అతడు, ఖలేజా రెండు చిత్రాలు వచ్చాయి.  ఈ రెండు కూడా మహేష్ నటనలో రెండు విభిన్నమైన కోణాలను సిల్వర్ స్క్రీన్ పై కొత్తగా చూపించారు త్రివిక్రమ్. దీంతో వస్తున్న ఈ మూడో సినిమాతో మహేష్ బాబుని త్రివిక్రమ్ ఏ విధంగా చూపించబోతున్నాడు అన్నది అభిమానులలో ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

Advertisement

వాస్తవానికి గత ఏడాది ఫిబ్రవరి నెలలో పూజ కార్యక్రమాలు ప్రారంభం  అయ్యాయి. ఆ సమయంలో ఈ ఏడాది ఏప్రిల్ 28 ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్లు పోస్టర్ తో కూడిన అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు. అయితే అంతలోనే మహేష్ బాబు తల్లిదండ్రులు మరణించడం.. షూటింగ్ వాయిదా పడటం రకరకాల కారణాలతో సినిమా వాయిదా పడింది. ఇప్పుడు ఏకంగా వచ్చే ఏడాది జనవరి నెలలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. పాన్ ఇండియా నేపథ్యంలో ఈ  మూవీ విడుదల చేయనున్నట్లు సమాచారం. చాలాకాలం తర్వాత మళ్లీ మహేష్  ఈ సినిమాలో సిగరెట్ తాగుతూ  కనిపించడం విశేషం.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

ఎన్టీఆర్ గురించి నమ్మలేని నిజం ఏంటో మీకు తెలుసా ?

నందమూరి బాలకృష్ణని ‘బాలయ్య’ అని ఎప్పటి నుంచి పిలుస్తున్నారో మీకు తెలుసా ?

 

Visitors Are Also Reading