Home » నందమూరి బాలకృష్ణని ‘బాలయ్య’ అని ఎప్పటి నుంచి పిలుస్తున్నారో మీకు తెలుసా ?

నందమూరి బాలకృష్ణని ‘బాలయ్య’ అని ఎప్పటి నుంచి పిలుస్తున్నారో మీకు తెలుసా ?

by Anji
Ad

నందమూరి నటసింహం, గాడ్ ఆఫ్ మాసెస్,  బాలకృష్ణను  అభిమానులు రకరకాల  పేర్లతో పిలుస్తుంటారనే విషయం తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిందే. ఇతడిని అభిమానులు ముద్దుగా నరసింహం అని.. బాలయ్య బాబు అని.. యువరత్న అని.. గోల్డెన్ స్టార్ అని.. ఇలా చాలా పేర్లతో పిలుచుకుంటారు అనే విషయం విధితమే. కానీ నందమూరి అభిమానులతో పాటు మామూలు తెలుగు ప్రేక్షకులు సైతం ఈయనను ఎక్కువగా జై బాలయ్య అనే పేరుతోనే పిలుస్తారు.  జై బాలయ్య అనే స్లోగన్ ఎలా వచ్చిందో..? ఎప్పటి నుంచి బాలయ్యను అలా పిలుస్తున్నారో మీకు తెలుసా ? ఒకవేళ  తెలియకపోతే ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

జై బాలయ్య అనే స్లోగన్ మాత్రం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిన పేరు. ఆమధ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ సినిమాలో ఏకంగా జై బాలయ్య అనే సాంగ్ కూడా పెట్టారు. ఈ పాట ఎంత పాపులర్ అయిందో ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సాంగ్ థియేటర్ లో వస్తుంటే నందమూరి అభిమానులు పూనకాలతో ఊగిపోయారు. ఇంతకు ముందు కంటే ఈ సాంగ్ వచ్చిన తర్వాత జై బాలయ్య అనే స్లోగన్ మరింత పవర్ ఫుల్ గా వినిపిస్తుంది.ఆ తర్వాత బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన వీరసింహారెడ్డి సినిమాకు కూడా ముందుగా జై బాలయ్య అనే టైటిల్ అనుకున్నారట.

Advertisement

Manam News

టాలీవుడ్ దర్శకుడు బి గోపాల్-బాలకృష్ణ కాంబినేషన్ అంటే తిరుగులేనిది. వీరిద్దరి కాంబోలో దాదాపు 5 సినిమాలు చేస్తే అందులో నాలుగు సూపర్ హిట్ అవ్వగా.. ఒకటి మాత్రమే ఫ్లాప్ అయింది.  1990 లో విడుదలైన లారీ డ్రైవర్  సినిమా చేసేటప్పుడు దర్శకుడు బి.గోపాల్ రచయితతో మీరు ఏమైనా రాసుకోండి.. కానీ పాటలో మాత్రం బాలయ్య అని మాత్రం వినిపించాలని చెప్పారట.  అప్పుడు రచయిత జొన్నవిత్తుల ఆయన విన్నపాన్ని విని అలాగే సాంగ్ లో బాలయ్య అని వచ్చే విధంగా బాలయ్య.. బాలయ్య.. గుండెల్లో గోలయ్య.. జై కొట్టాలయ్యా.. అనే పాట రాశారు.  ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి అందించిన స్వరాలు లారీ డ్రైవర్ చిత్రాన్ని విజయవంతం చేశాయి. ఈ సినిమా వచ్చి మూడు దశాబ్దాలు అవుతున్న ఇప్పటికీ బాలకృష్ణను బాలయ్య అని ముద్దుగా పిలుచుకోవడం అలవాటు అయ్యింది. ఇలా బాలయ్య కాస్త జై బాలయ్య గా మారిపోయారు. ఈ మధ్య బాలయ్య సినిమా విడుదల రోజు జై బాలయ్య నినాదాలతో థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

ఎన్టీఆర్ గురించి నమ్మలేని నిజం ఏంటో మీకు తెలుసా ?

 త్రిష ఈ సౌత్ స్టార్స్ తో ఇన్ని సార్ల… ఈ లెక్కలు తెలిస్తే షాక్ అవుతారు..!

 

Visitors Are Also Reading