Home » విక్ర‌మ్ సినిమా గురించి మ‌హేష్ బాబు చేసిన‌ ట్వీట్ వైర‌ల్‌..!

విక్ర‌మ్ సినిమా గురించి మ‌హేష్ బాబు చేసిన‌ ట్వీట్ వైర‌ల్‌..!

by Anji
Ad

విక్ర‌మ్ సినిమా గురించి ఇక ఎంత చెప్పినా త‌క్కువే అంటున్నారు ప‌లువురు సినీ రంగ ప్ర‌ముఖులు, అభిమానులు. లోక నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన విక్ర‌మ్ సినిమా ప్ర‌స్తుతం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర అదిరిపోయే రేంజ్ క‌లెక్ష‌న్ల‌ను వ‌సూలు చేస్తున్న విష‌యం విధిత‌మే. జూన్ 03 ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌లైన విక్ర‌మ్ చిత్రం తొలి ఆట నుంచే విడుద‌లైన అన్ని చోట్ల నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని ప్ర‌స్తుతం బాక్సాఫీస్ వ‌ద్ద ప్ర‌భంజ‌నం సృష్టిస్తోంది. ఈ సినిమాను సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు పొగ‌డ్త‌లు చేసారు.


ఇప్ప‌టి సినిమాల్లో న్యూ ఏజ్ హ‌ల్ట్ క్లాసిక్ ఈ సినిమా అని ట్వీట్ చేశారు. ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ లోకేష్ క‌న‌గ‌రాజ్ నేను మిమ్మ‌ల్ని క‌లిసి విక్ర‌మ్ సినిమా ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి చివ‌రి వ‌ర‌కు చిత్రీక‌ర‌ణ ఏవిధంగా జ‌రిగిందో తెలుసుకుంటానంటూ ట్వీట్ చేశారు మ‌హేష్‌బాబు. ఈ సినిమా అన్ని ర‌కాలుగా మైండ్ బ్లోయింగ్ అనిపించింద‌ని అన్నారు. లెజెండ‌రీ యాక్ట‌ర్ క‌మ‌ల్‌హాస‌న్ న‌ట‌న గురించి మాట్లాడే అర్హ‌త నాకు ఇంకా రాలేదు. నా అనుభ‌వం స‌రిపోదు అని, ఒక్క మాట‌లో చెప్పాలంటే నేను ఆయ‌న అభిమాని అయినందుకు చాలా గ‌ర్వంగా ఉందంటూ మ‌హేష్ చేసిన ఈ ట్వీట్ ఎంతో ఆస‌క్తి రేపింది.

Advertisement

Advertisement


అందులో ప‌హ‌ద్ పాజిల్ విజ‌య్ సేతుప‌తి న‌ట‌న‌లో మెరుపులు క‌నిపించాయ‌న్నారు. అంతేకాదు.. అనిరుధ్ బెస్ట్ మ్యూజిక్ అందించాడ‌ని చాలా కాలం త‌రువాత విక్ర‌మ్ నా ప్లే లిస్ట్‌లో టాప్‌లో ఉంద‌ని పొగిడారు మ‌హేష్‌. క‌మ‌ల్ సార్ చిత్ర బృందానికి శుభాకాంక్ష‌లు అని మ‌హేష్ చేసిన ఈ ట్వీట్ వైర‌ల‌వుతోంది. ఇక విక్ర‌మ్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా బాక్సాఫీస్ వ‌ద్ద మ‌రో సంచ‌ల‌న రికార్డునే సృష్టించింది. విక్ర‌మ్ చిత్రం తాజాగా 400 కోట్ల క్ల‌బ్‌లో చేరింది. ర‌జినికాంత్ 2.o త‌రువాత ఈ ఘ‌న‌త సాధించిన రెండ‌వ త‌మిళ సినిమా విక్ర‌మ్ అనే చెప్పాలి. ఈ సినిమా ఇప్ప‌టివ‌ర‌కు 404 కోట్ల‌ను వ‌సూలు చేస్తే.. అందులో 120 కోట్ల‌కు పైగా ఓవ‌ర్సిస్‌లో వ‌సూలు చేయ‌డం విశేషం.

Also Read : 

అఖండ సినిమా వాళ్ల శ్రీకాంత్ నష్టపోయాడా…?

 

Visitors Are Also Reading