Home » అఖండ సినిమా వాళ్ల శ్రీకాంత్ నష్టపోయాడా…?

అఖండ సినిమా వాళ్ల శ్రీకాంత్ నష్టపోయాడా…?

by Azhar
Ad

తెలుగులో ఈ మధ్య హీరోలు తన రూట్ మారుస్తున్నారు. సినిమాల్లో హీరోగా అవకాశాలు రాకపోతే విలన్ గా ఎంట్రీ ఇస్తున్నారు. అలా వచ్చి సక్సెస్ అయిన వారిలో జగపతి బాబు ముందుంటాడు. ఇక జగపతి బాబు ను చూసి మరికొంత మంది అదే దారిలోకి వచ్చారు. అందులో ఒక్కపాటి టాలీవుడ్ స్టార్ హీరో శ్రీకాంత్ కూడా ఉంటాడు. అప్పట్లో శ్రీకాంత్ హిరోగ్గ చేసిన సినిమాలు ఫ్యామిలీ అడియాన్స్ ను బాగా మెప్పించాయి. కానీ ఆ తర్వాత హీరోగా అవకాశాలు తగ్గిపోవడంతో సహాయ పాత్రలకు పరిమితం అయ్యాడు. అలంటి సమయంలోనే విలన్ పాతరాలు చేయడం పారంభించాడు.

Advertisement

అదే దారిలో తాజాగా బాలకృష్ణ , బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన.. అఖండ సినిమాలో విలన్ గా కనిపించాడు శ్రీకాంత్. అయితే ఈ సినిమా ముందువరకు చిన్న చిన్న సినిమాల్లో విలన్ గా నటించిన శ్రీకాంత్… ఈ సినిమాలో బాలయ్యను ఢీ కొడుతుండటంతో.. తర్వాత ఇంకా ఎక్కువ ఆఫర్స్ వస్తాయి అని అనుకున్నాడు. అందుకు తగ్గట్లుగానే ఇందులో శ్రీకాంత్ అసలు విలన్ అని చాలా మంది అనుకున్నారు. కానీ సినిమా ప్రజల ముందుకు వచ్చిన తర్వాత మొత్తం మారిపోయింది. ఎందుకంటే ఈ సినిమాలో శ్రీకాంత్ విలన్ కింద పనిచేసే మరో విలన్.

Advertisement

అసలు అఖండ సినిమాలో మెయిన్ విలన్ గా మెహతా అనే వేరే నటుడు కనిపించాడు. అందువల్ల శ్రీకాంత్ విలనిజం అనేది ఎక్కువగా జనాలకు ఎక్కలేదు. మిగితా సినిమాల మాదిరిగానే ఇందులో కూడా ఓ సహాయ పాత్రగా మిగిలిపోయాడు శ్రీకాంత్. అందువల్ల అఖండ సినిమా భారీ విజయం సాధించినా కూడా శ్రీకాంత్ కు ఎలాంటి లాభం జరగలేదట. ఇప్పుడు కూడా ఆయన దగ్గరకు మామూలుగానే సహాయ పాత్రలు తప్ప.. మెయిన్ విలన్ పాత్రలు అనేటివి రావడం లేదు అని తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి :

నా భార్య కోసమే టైం లేదు.. ఇక ఐపీఎల్ కోసం ఎక్కడిది..?

ఐపీఎల్ వైఫల్యం పై జడేజా షాకింగ్ కామెంట్స్…!

Visitors Are Also Reading