టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు మాతృ వియోగం కలిగింది. సీనియర్ హీరో కృష్ణ సతీమణి, మహేష్ తల్లి ఇందిరా దేవి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇవాళ మృతి చెందింది. ఈ ఏడాది జనవరిలో కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు కన్ను మూసిన ఘటన మరువక ముందే తాజాగా కృష్ణ సతీమణి ఇందిరాదేవి కన్ను మూయడం విషాదకరం. కృష్ణ, ఇందిరా దేవి దంపతులకు ఐదుగురు సంతానం. రమేష్ బాబు, మహేష్ బాబు, పద్మావతి, మంజుల, ప్రియదర్శిని. సుధీర్ బాబు ప్రియదర్శిని భర్త. పెద్ద కుమారుడు రమేష్ బాబు మృతితో ఆమె కృంగి పోయింది. అప్పటికే అనారోగ్యంతో బాధపడుతుండడంతో ఇవాళ ఉదయం ఆమె ఇంట్లోనే తుది శ్వాస విడిచారు.
మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఐదేళ్ల కిందట విడుదలైన శ్రీశ్రీ సినిమా తరువాత సూపర్ స్టార్ కృష్ణ మరే సినిమాలో నటించలేదు. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ దర్వకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో పూజాహెగ్దే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. ఫస్ట్ షెడ్యూల్‌లో కొన్ని హై ఆక్టేన్ ఎపిక్ యాక్షన్ సన్నివేశాలను షూట్ చేశారట. రెండో షెడ్యూల్ దసరా తరువాత ప్రారంభం కానున్నదని చిత్ర నిర్మాత ప్రకటించారు. ఈ తరుణంలోనే మహేష్ బాబు తల్లి మరణించడం బాధకరం.
Also Read : ఆ ఒక్క కారణంతో మన్మథుడు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో !
దాదాపు 12 సంవత్సరాల తరువాత మహేష్ బాబుతో చేస్తున్న ఈ సినిమాను త్రివిక్రమ్ భారీ అంచనాలు అందుకునేలా తెరకెక్కిస్తున్నారట. త్రివిక్రమ్ సినిమాకు అయోధ్యలో అర్జునుడు అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. దసరాకి అధికారికంగా ప్రకటించనున్నారనే తరుణంలోనే మహేష్ బాబు తల్లి తిరిగిరాని లోకాలకు వెళ్లింది. త్రివిక్రమ్ సినిమా పూర్తి కాగానే దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు మహేష్.
Also Read : అల్లు అర్జున్, అల్లు శిరీష్ గొడవ పడ్డారా..?