Home » ఆ ఒక్క కార‌ణంతో మ‌న్మ‌థుడు లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో !

ఆ ఒక్క కార‌ణంతో మ‌న్మ‌థుడు లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో !

by AJAY
Published: Last Updated on
Ad

టాలీవుడ్ లోని స్టార్ హీరోల‌లో నాగార్జున కూడా ఒక‌రు. నాగార్జున ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాల‌లో న‌టించి అభిమానుల‌ను సంపాదించుకున్నారు. ముఖ్యంగా నాగార్జున అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడిగా మ‌న్మ‌థుడుగా టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్ర‌స్తుతం నాగార్జున ఇద్ద‌రు కుమారులు కూడా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సినిమాలు చేస్తున్నారు. నాగ్ కూడా వారికి పోటీ ఇస్తు సినిమాలు చేయ‌డం గ్రేట్. అంతే కాకుండా అర‌వై దాటినా కూడా నాగ్ 20 ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తుంటాడు.

ఇవి కూడా చదవండి:  గాడ్ ఫాదర్” సినిమా పోస్టర్ పై నెట్టింట దారుణమైన ట్రోల్స్….చూసుకోవాలి కదా డైరెక్టర్ గారూ…!

Advertisement

ఇక నాగార్జున కెరీర్ లోని బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌లో మ‌న్మ‌థుడు సినిమా కూడా ఒక‌టి. ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఈ సినిమాకు విజ‌య్ భాస్క‌ర్ ద‌ర్శ‌కత్వం వ‌హించారు. ఇక ఈ సినిమాకు క‌థ‌ను త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించారు. వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో వ‌చ్చిన నువ్వేకావాలి సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచిన సంగ‌తి తెలిసిందే.

ఇవి కూడా చదవండి : లీకుల బెడదతో ప్రశాంత్ నీల్ కఠిన నిర్ణయం..!

Advertisement

కాగా ఈ సినిమా త‌ర‌వాత కూడా విజ‌య్ భాస్క‌ర్ త్రివిక్ర‌మ్ క‌థ మాట‌ల‌తో మ‌రో సినిమా చేయాల‌ని అనుకున్నార‌ట‌. కానీ త్రివిక్ర‌మ్ మాత్రం సొంతంగా ద‌ర్శ‌కుడిగా ఓ సినిమా చేయాల‌ని ఫిక్స్ అయ్యార‌ట‌. అంతే కాకుండా రెండు క‌థ‌ల‌ను రాసుకోగా విజయ్ భాస్క‌ర్ కు కూడా న్యాయం చేసేలా ఆయ‌న‌కు మ‌న్మ‌థుడు క‌థ‌ను ఇచ్చార‌ట‌. అయితే ఆ క‌థ‌ను త్రివిక్ర‌మ్ త‌రుణ్ కోసం రాసుకున్నారు.

కానీ చివ‌రికి విజ‌య్ భాస్క‌ర్ కు ఆ క‌థ‌ను ఇచ్చి త‌రుణ్ తో నువ్వే నువ్వే సినిమాను ప్రారంభించాడు. ఇక‌ విజ‌య్ భాస్క‌ర్ ఆ క‌థ‌ను తీసుకుని నాగార్జున వ‌ద్ద‌కు వెళ్లార‌ట‌. అప్పటికే విజ‌య్ భాస్క‌ర్ సూప‌ర్ హిట్స్ ఇవ్వ‌డంతో నాగార్జున క‌థ‌ను విన్నారు. అంతే కాకుండా ఆ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. అక్క‌డితో ఆగ‌కుండా తాను ఈ సినిమాను నిర్మిస్తాన‌ని నాగార్జున మాటిచ్చారు కూడా. అలా విజ‌య్ భాస్క‌ర్ సినిమాను నాగార్జున‌తో తెర‌కెక్కించాడు. ఈ సినిమాలోని పాట‌లు డైలాగులు ఎమోష‌న‌ల్ సీన్లు ఇలా అన్నీ ప్రేక్ష‌కుల‌కు తెగ‌న‌చ్చేశాయి.

ఇవి కూడా చదవండి : సూపర్ స్టార్ కృష్ణ. మెగా స్టార్ చిరంజీవి ల కాంబినేషన్లో రెండవ సినిమా ఎందుకు మధ్యలోనే నిలించిపోయింది ?

Visitors Are Also Reading