Home » OG Movie : పవన్‌ కళ్యాణ్‌ ఓజీ సినిమాలో మహేష్‌ బాబు గెస్ట్‌ రోల్‌?

OG Movie : పవన్‌ కళ్యాణ్‌ ఓజీ సినిమాలో మహేష్‌ బాబు గెస్ట్‌ రోల్‌?

by Bunty
Ad

మహేష్ బాబు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అతిచిన్న వయసు నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇండస్ట్రీలో తనకంటూ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఎప్పటికప్పుడు సినిమాలు చేసుకుంటూ ప్రేక్షకులను అలరించే మహేష్ బాబు ప్రస్తుతం ‘గుంటూరు కారం’ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు.

Mahesh Babu's guest role in Pawan Kalyan's Og movie

Mahesh Babu’s guest role in Pawan Kalyan’s Og movie

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న మహేష్ బాబు ఓ క్రేజీ ప్రాజెక్టులో గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారట. ఇక మహేష్ బాబు గెస్ట్ రోల్ లో నటిస్తున్నారనే వార్త తెలియగానే ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది. మహేష్ బాబు గెస్ట్ రోల్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. తాను ఓకే చెప్పింది పవన్ కళ్యాణ్ ‘ఓజి’ సినిమాలో గెస్ట్ రోల్. గతంలో పవన్ కళ్యాణ్ నటించిన ‘జల్సా’ సినిమాకు మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇక జల్సా సినిమా అనంతరం మహేష్ బాబు ఇప్పటివరకు గెస్ట్ రోల్ పాత్రలు చేయలేదు.

Advertisement

Advertisement

గెస్ట్ రోల్ పాత్రలు చేయాలనే ఉద్దేశం కూడా తనకు లేదని మహేష్ బాబు చాలా సందర్భాల్లో వెల్లడించాడు. ఇక ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబును కలిసిన మేకర్స్ గెస్ట్ రోల్ కి సంబంధించిన నేరేషన్ ను కూడా ఇచ్చారట. ఇక ఈ ఆఫర్ విషయంలో మహేష్ బాబు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఓజి సినిమాలో మహేష్ బాబు గెస్ట్ రోల్ చేయించాలని దర్శక నిర్మాతలు ప్లాన్ లో ఉన్నారట. ఇక మహేష్ బాబు మాత్రం కొత్త ప్రాజెక్ట్ ఏవి వచ్చినా కూడా జనవరి తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి పంపిస్తున్నారట. మరి గెస్ట్ రోల్ విషయంలో ఎప్పుడు క్లారిటీ వస్తుందో తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

బన్నీ మొదటి జీతం రూ.3500 మాత్రమే..ఇప్పుడు ఆయన ఆస్తుల విలువెంతో తెలుసా?

Samantha : రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న సమంత.. ?

Rajinikanth : తెలంగాణ గవర్నర్‌గా సూపర్ స్టార్ రజినీకాంత్‌.. ?

Visitors Are Also Reading