Home » బన్నీ మొదటి జీతం రూ.3500 మాత్రమే..ఇప్పుడు ఆయన ఆస్తుల విలువెంతో తెలుసా?

బన్నీ మొదటి జీతం రూ.3500 మాత్రమే..ఇప్పుడు ఆయన ఆస్తుల విలువెంతో తెలుసా?

by Bunty
Ad

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘పుష్ప’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైనటువంటి పుష్ప సినిమా బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టింది. ఇక ఈ సినిమాకుగాను తాజాగా అల్లు అర్జున్ ఉత్తమ నటుడుగా అవార్డును అందుకున్నారు. సినిమాల్లోకి రాకముందు యానిమేటెడ్ డిజైనర్ గా తన కెరీర్ మొదలుపెట్టిన అల్లు అర్జున్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.

Allu Arjun Net Worth

Allu Arjun Net Worth

యానిమేటెడ్ డిజైనర్ గా తన కెరీర్ ప్రారంభించినప్పుడు తన రెమ్యూనరేషన్ 3500 మాత్రమే. ఇక ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరోగా అల్లు అర్జున్ నిలిచాడు. తాను ఒక్కో సినిమాకు గాను కోట్లలోనే పారితోషికం తీసుకుంటున్నాడు. ఇక అల్లు అర్జున్ ఆస్తి విలువ సుమారు 410 కోట్లకు పైనే ఉంటుందట. అంతేకాకుండా అల్లు అర్జున్ పలు బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తూ కోట్లలో డబ్బులను ఆర్జిస్తున్నారు.

Advertisement

Advertisement

allu arjun

ఇక అల్లు అర్జున్ గ్యాలరీలో పలు లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. అల్లు అర్జున్ కు కార్లు అంటే యమపిచ్చి. తన గ్యారేజీలో రేంజ్ రోవర్ కార్, వానిటివ్యాన్, బీఎండబ్ల్యూ, జాగూర్, ఆడి వంటి కార్లు అల్లు అర్జున్ గ్యాలరీలో ఉండడం విశేషం. ఇక అల్లు అర్జున్ కి హైదరాబాదులో పలు వ్యాపారాలు కూడా ఉన్నాయి. మల్టీప్లెక్స్ లు, రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం అందుతుంది. ఇక హైదరాబాదులో అల్లు అర్జున్ కి 100 కోట్ల విలువ చేసే భవనం కూడా ఉంది. ఇక అల్లు అర్జున్ కి పలు స్టూడియోలు కూడా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

Samantha : రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న సమంత.. ?

Rajinikanth : తెలంగాణ గవర్నర్‌గా సూపర్ స్టార్ రజినీకాంత్‌.. ?

Yadamma Raju : రెండో పెళ్లి చేసుకున్న యాదమ్మ రాజు..!

Visitors Are Also Reading