Home » గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ బాబు ఎమోషనల్ కామెంట్స్..!

గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ బాబు ఎమోషనల్ కామెంట్స్..!

by Anji
Ad

సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా “గుంటూరు కారం” ప్రీ రిలీజ్ ఈవెంట్ గుంటూరులో నిర్వహించారు.ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గుంటూరులో జరగటం చాలా ఆనందం కలిగించిందని తెలిపారు. మా ఊరిలోనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాలనేది త్రివిక్రమ్ నిర్ణయించారు. ఆయన చెప్పినట్టే ఇక్కడే జరిగింది.  త్రివిక్రమ్  చాలా మంచి వ్యక్తి.  నా జీవితంలో ఫ్రెండ్ కంటే ఎక్కువ. నా కుటుంబ సభ్యుడు. గత రెండు సంవత్సరాల నుంచి నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు.

Advertisement

ముఖ్యంగా నేను ఎక్కువగా త్రివిక్రమ్ గారి గురించి ఎక్కడా చెప్పను. ఎందుకు అంటే.. కుటుంబ సభ్యుల గురించి మనం ఎక్కువగా చెప్పం కదా.. మా కాంబినేషన్ లో ఎప్పుడు సినిమా చేసిన ఏదో ఒక మ్యాజిక్ జరుగుద్ది. అతడు, ఖలేజా సినిమాలలో జరిగిన మ్యాజిక్.“గుంటూరు కారం”లో కూడా అదే మ్యాజిక్ జరిగింది. ఇందులో కొత్త మహేష్ బాబుని చూస్తారు. ఐ లవ్ యు సార్ అంటూ త్రివిక్రమ్ నీ మహేష్ పొగడ్తలతో ముంచెత్తారు మహేష్ బాబు.  ఇక మా నిర్మాత చినబాబు గారికి మోస్ట్ ఫేవరెట్ హీరో నేనే. దీంతో మానిటర్ దగ్గర ఎడిటింగ్ రూంలో ఆయన ముఖంలో ఆనందం. చూసినప్పుడల్లా నాకు ఆనందం కలుగుతుంది.  ఒక ప్రొడ్యూసర్ ముఖంలో ఆనందం వచ్చినప్పుడు ఆ ఫీలే వేరు. నన్ను బాగా చూసుకున్నారు. మీతో ఇంకా ఎక్కువ సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను.

Advertisement

చాలా కాలం తర్వాత తెలుగు అమ్మాయి శ్రీలీల టాప్ హీరోయిన్ గా రాణిస్తుంది. ఆమెతో డాన్స్ చేయటం ఏ హీరోల వల్ల కాదు అంటూ మహేష్  చెప్పారు. హీరోల తాట తీస్తది శ్రీలీల.  ఇంకా సినిమాలో మీనాక్షి చౌదరి గెస్ట్ పాత్ర చేసిందని ఆ పాత్ర ఒప్పుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అంటే తనకు ఎంతో ఇష్టమని అన్నారు. నాకు సోదరుడు లాంటివాడు ప్రతిసారి తన బెస్ట్ ఇచ్చాడు. ఈసారి కూడా అదే రకమైన ఔట్ పుట్ ఇచ్చాడు అని థమన్ నీ ప్రశంసించారు. సంక్రాంతి పండుగ నాకెంతో కలిసి వస్తది. సంక్రాంతి పండుగకు నాది లేదా నాన్నగారిది ఏ సినిమా విడుదలైన సూపర్ డూపర్ హిట్ అవుద్ది. కచ్చితంగా “గుంటూరు కారం” విజయం సాధిస్తోంది. అయితే నాన్నగారు ఉన్న సమయంలో ఆయన నా సినిమా రికార్డుల గురించి కలెక్షన్స్ గురించి ఫోన్ చేసి చెప్పేవాళ్ళు. ఆయన ఫోన్ కాల్ కోసం నేను ఎంతగానో ఎదురుచూసే వాడిని. కానీ ఇప్పుడు ఆయన మన మధ్య లేరు. ఇప్పుడు అవన్నీ మీరే చెప్పాలి. ఎందుకంటే ఇక నుండి మీరే నాకు అమ్మ నాన్న. అని ఫ్యాన్స్ ని ఉద్దేశించి మహేష్ బాబు ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. కంట పెడుతూ తన స్పీచ్ ముగించారు మహేష్ బాబు.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading