Home » సినిమాల్లో నటించమన్నపుడు మహేష్ బాబు ఏం చేసాడో తెలుసా..?

సినిమాల్లో నటించమన్నపుడు మహేష్ బాబు ఏం చేసాడో తెలుసా..?

by Azhar
Ad
టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా తన ప్రయాణం సాగిస్తున్న మహేష్ బాబు. సూపర్ స్టార్ కృష్ణ కుమారుడిగా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ ఇప్పుడు టాలీవుడ్ లోకి టాప్ హీరోలలో ఒక్కడు. సూపర్ హిట్ సినిమాలు చేస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు మహేష్. అయితే ప్రస్తుతం కృష్ణ వయస్సు సహకరించక సినిమాల్లో నటించడం లేదు. ఇంట్లోనే మనవడు, మానవరాలుతో గడుపుతున్నాడు. ఇదే క్రమంలో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కృష్ణ కొన్ని ఆసక్తికర విషయాలను బయట పెట్టాడు.
అక్కడ కృష్ణకు మహేష్ బాబుని హీరోగా పరిచయం చేయడం గురించి ప్రశ్న ఎదురవగా… అసలు చిన్నతనంలో మహేష్ ను నటించమని అడిగినప్పుడు ఏం జరిగింది అనే ఓ సరదా సంఘటనను ఆయన వెల్లడించారు. కృష్ణ మాట్లాడుతూ.. అప్పట్లో నేను ఓరోజు మహేష్ ను నాతో పాటు సినిమా షూటింగ్ కు తీసుకెళ్ళాను. అక్కడ మేము షూటింగ్ చేస్తుంటే.. మహేష్ ఓ మూలాన కూర్చొని మా షూటింగ్ చూస్తున్నాడు. ఆ సమయంలో నేను మహేష్ ను చూసి నువ్వు కూడా నటిస్తావా అని అడిగాను. దానికి ససేమిరా చేయను చెప్పేసాడు.
కానీ ఆ తరువాత నేను కొంచెం గట్టిగా చేస్తావా లేదా అని అడిగేసరికి చేయను అంటూ ఆ స్టూడియో మొత్తం పరిగెత్తాడు. మేహేష్ తో పాటుగా నేను కూడా మొత్తం పరుగు పెట్టాల్సి వచ్చింది అని కృష్ణ తెలిపాడు. అయితే మేహేష్ బాబు బాల్య నటునిగానే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. తన తండ్రితో కలిసి ఎన్నో సినిమాలో నటించాడు. ఆ తర్వాత 1999 లో రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడు. ఇక ఈ మధ్యే మహేష్ నటించిన సర్కారు వారి పాట సినిమా విడుదలైంది. అయితే ఇప్పుడు మహేష్ బాబు త్రివిక్రమ్, రాజమౌళి, కొరటాల శివ ఇలా టాప్ డైరెక్టర్స్ తో వరుస సినిమాలు చేస్తున్నారు.

Advertisement

Visitors Are Also Reading