Home » మహేష్ తో రాజమౌళి అన్ని ఏళ్ళు సినిమా తీయనున్నారా..?

మహేష్ తో రాజమౌళి అన్ని ఏళ్ళు సినిమా తీయనున్నారా..?

by Azhar
Ad

దర్శకధీరుడు రాజమోళి సినిమాలు అంటే ఇప్పుడు ఓ ట్రెండ్ సెట్టర్ అనే విషయం అందరికి తెలిసిందే. ఇప్పటివరకు ఆయన తీసిన సినిమాల్లో ఒక్క సినిమా కూడా ప్లాప్ కాలేదు. అయితే 2016 లో ఆయన తీసిన బాహుబలి ఆయన రేంజ్ ను ఒక్కసారి మార్చేసింది. ఇక ఆ తర్వాత వచ్చిన బాహుబలి 2 అనే సినిమా రాజమౌళిని పాన్ ఇండియా డైరెక్టర్ ను చేసింది. ఇక ఈ రెండు సినిమాల తర్వాత ఇప్పుడు ఈ ఏడాది రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ అనే సినిమా కూడా 1000 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్ ను సాధించింది.

Advertisement

అయితే రాజమౌళి ఇంత ఘానా విజయాలు సాధించడానికి చాలా కష్టపడతాడు. ప్రతి సీన్ ను చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తారు. ఎన్నిసార్లు ఆ సీన్ తీసిన సరే.. తనకు కావాల్సిన విధంగా అది వచ్చేవరకు దానిని వదిలిపెట్టడు. అందుకే అందరూ రాజమౌళిని జక్కన అని పిలుస్తుంటారు. ఇక రాజమౌళి ఏదైనా సినిమాకు కమిట్ అయినప్పుడే తనకు తగ్గిన విధంగా హీరోల డేట్స్ అనేవి లాక్ చేస్తాడు. గతంలో బాహుబలి సినిమా కోసం ఏకంగా ప్రభాస్ 5 ఏళ్ళు రాజమౌళికి ఇచ్చాడు. అదే విధంగా ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా కోసం కూడా రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు మూడేళ్లు ఇచ్చినట్లు తెలుస్తుంది.

Advertisement

ఇక ఇప్పుడు తాజాగా రాజమౌళి తన తర్వాతి సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కించనున్నాడు అనే విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమా బడ్జెట్ ఇప్పటికే 500 కోట్ల కంటే ఎక్కువ చర్చ జరుగుతుంది. ఇదే క్రమంలో ఇప్పుడు మహేష్ ఎన్ని ఏళ్ళు రాజమౌళికి ఇచ్చాడు అనేది పెద్ద చర్చగా నడుస్తుంది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు రాజమౌళితో సినిమా కోసం మూడు. మూడున్నర ఏళ్ళు డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమా కథ ఎలా ఉంటుంది అనేది ఇంకా తెలియడం లేదు. చూడాలి మరి ఏ కథతో మహేష్ తో రాజమౌళి సినిమా తీస్తాడు అనేది.

ఇవి కూడా చదవండి :

ఈ ఏడాది 7వ కెప్టెన్ గా ధావన్…!

ఇంగ్లాండ్ బాగా ఆడింది.. అందుకే ఓడిపోయాం : ద్రావిడ్

Visitors Are Also Reading