Home » ఈ ఏడాది 7వ కెప్టెన్ గా ధావన్…!

ఈ ఏడాది 7వ కెప్టెన్ గా ధావన్…!

by Azhar
Ad

భారత జట్టుకు సరైన కెప్టెన్ దొరకడం లేదా అంటే అవును అనే అనిపిస్తుంది. ఈ ఏడాది బోర్డు చేస్తున్న పనులు… మారుస్తున్న కెప్టెన్లను చూస్తుంటే అవును అనే అనిపిస్తుంది. ప్రస్తుతం టీం ఇండియా రెగ్యులర్ కెప్టెన్ గా రోహిత్ శర్మ ఉన్నాడు. కానీ రోహిత్ రకరకాల పరిస్థితుల కారణంగా జట్టుకు దూరం కావడం.. అలాగే బీసీసీఐ రెండో టీంతో కూడా ఆడించడం వల్ల కెప్టెన్ల సంఖ్య పెరిగిపోతుంది. అయితే ఈ ఏడాది ఇప్పటికే రోహిత్ శర్మ, అజింక్య రహానే, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్య, బుమ్రా రూపంలో ఆరుగురు కెప్టెన్సీ వహించగా.. ఇప్పుడు మరో ఆటగాడు కూడా ఈ లీగ్ లో చేరాడు.

Advertisement

అయితే ప్రస్తుతం ఇంగ్లాండ్ లో ఉన్న టీం ఇండియా అక్కడ జట్టుతో ఇంకా వన్డే, టీ20 సిరీస్ లు ఆడాల్సి ఉంది. అయితే ఈ పర్యటన ముగిసిన తర్వాత భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళాల్సి ఉంది. అక్కడ జులై 22 నుండి 27 వరకు మూడు వన్డేల సిరీస్ లో మన జట్టు తలపడాల్సి ఉంది. ఈ క్రమంలో ఈ వన్డే జట్టును ప్రకటించిన బీసీసీఐ కెప్టెన్ గా శిఖర్ ధావన్ ను నియమించింది. అలాగే వైస్ కెప్టెన్ గా రవీంద్ర జడేజాను నియమించింది. అయితే జట్టులోని సీనియర్ ఆటగాళ్లకు అందరికి విశ్రాంతి ఇచ్చిన బీసీసీఐ మొత్తం యువ ఆటగాళ్లతో ఈ జట్టును నింపేసింది. అయితే పైన పేర్కొన ఆరుగురు కెప్టెన్లు కూడా ఇప్పుడు ప్రకటించిన జట్టులో లేకపోవడం… ఇక గత ఏడాది శ్రీలంక పర్యటనలో కెప్టెన్సీ చేసిన అనుభవం ధావన్ కు ఉండటం వల్లే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

Advertisement

విండీస్ పర్యటనకు వెళ్లే టీం ఇండియా : శిఖర్ ధావన్ (C), రవీంద్ర జడేజా (VC), రుతురాజ్ గైక్వాడ్, శుభమన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (WK), సంజు శాంసన్ (WK), శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అవేష్ ఖాన్ , ప్రసిద్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్

ఇవి కూడా చదవండి :

విహారి ఆ క్యాచ్ ప‌ట్టి ఉంటే మ్యాచ్ మ‌రోలా ఉండేది.. నెటిజ‌న్ల కామెంట్స్…

ఐదో టెస్టులో ఇంగ్లాండ్ విజ‌యం.. 45 ఏళ్ల రికార్డు బ్రేకు..!

Visitors Are Also Reading