Home » కేజీఎఫ్ 2ని దెబ్బ కొట్టిన బుల్లితెర ఫ్యాన్స్..!

కేజీఎఫ్ 2ని దెబ్బ కొట్టిన బుల్లితెర ఫ్యాన్స్..!

by Azhar
Ad

రాకింగ్ స్టార్ యష్ హీరోగా ఈ ఏడాది విడుదలైన సినిమా కేజీఎఫ్ 2. అయితే ఈ సినిమా మొదటి భాగం ఎటువంటి అంచనాలు లేకుండా పాన్ ఇండియా లెవల్ లో విడుదలై సూపర్ హిట్ అందుకుంది. దాంతో కేజీఎఫ్ 2 సినిమా పై అందరికి అంచనాలు అనేవి భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమా ఎప్పుడు ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురు చూసారు.

Advertisement

అయితే 100 కోట్ల బడ్జెట్ తో వచ్చిన కేజీఎఫ్ 2 సినిమా బ్లాక్ బ్లస్టర్ గా నిలిచింది. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలైన రెండు వరాల తర్వాత వచ్చిన ఈ కేజీఎఫ్ 2 భారీ వసూళ్లు సాధించింది. ఆర్ఆర్ఆర్ కంటే ఎక్కువ వసూళ్లు ఈ సినిమాకే వచ్చాయి. కానీ తాజాగా ఈ సినిమాను చేతు అనుభవం అనేది ఏర్పడినట్లు తెలుస్తుంది. ఈ సినిమాను వెండి తెర ఫ్యాన్స్ హిట్ చేసిన.. బుల్లితెర ఫ్యాన్ మాత్రం దెబ్బ కొట్టినట్లు తెలుస్తుంది.

Advertisement

అయితే ఈ మధ్యే కేజీఎఫ్ 2 సినిమా దేశ వ్యాప్తంగా ఒక్కేసారి టీవీలో ప్రసారమైంది. కానీ ఈ సినిమాకు టీవీ రేటింగ్స్ మాత్రం చాల తక్కువగా వచ్చినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా తెలుగులో అయితే కేజీఎఫ్ 2కి దారుణమైన రేటింగ్స్ వచ్చినట్లు సమాచారం. అయితే ఈ సినిమాను చాల మంది థియేటర్లలోనే రెండు సార్ల కంటే ఎక్కువ చూసారు. మిగిలిన వాళ్ళు ఓటీటీలోకి వచ్చిన తర్వాత చేసినందుకే టీవీలో కేజీఎఫ్ 2 కి రేటింగ్స్ రాలేదు అని తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి :

విరాట్ వన్డేలకు సరిపోతాడు.. టీ20లకు వేస్ట్..!

ఫ్యాన్స్ కు దాదా షాక్.. అందులోనుండి తప్పుకుంటున్నాను అని..?

Visitors Are Also Reading