Home » మరో రికార్డు సృష్టించిన లవ్ టుడే మూవీ..!

మరో రికార్డు సృష్టించిన లవ్ టుడే మూవీ..!

by Anji
Ad

ఈ మధ్య కాలంలో చిన్న సినిమాగా వచ్చి పెద్ద సినిమాలకు ధీటుగా సూపర్ హిట్ సాధించిన సినిమాలు చాలానే ఉన్నాయి. అలాంటి వాటిలో  కాంతార, లవ్ టుడే, బలగం వంటి సినిమాలు అదేకోవకు చెందినవి. ముఖ్యంగా కథలో బలం ఉంటే చాలు.. ప్రేక్షకులే సినిమాను బ్లాక్ బస్టర్ చేస్తున్నారు. ఓహిట్ సినిమా తీయాలంటే రూ.100ల కోట్లు అవసరం లేదని ఇలాంటి చిన్న సినిమాలు నిరూపిస్తున్నాయి.  

Also Read :  పుష్ప 2 గురించి ఆ మాజీ ఐజీ ఏమన్నారో తెలుసా ?

Advertisement

Advertisement

ఇలా సూపర్ హిట్ సాధించిన వాటిలో లవ్ టుడే సినిమా ఒకటి. తమిళ మూవీగా వచ్చిన లవ్ టుడే మంచి విజయాన్ని దక్కించుకుంది. ఆ తరువాత తెలుగులో కూడా విడుదలై మంచి హిట్ టాక్ తో దూసుకెళ్లింది. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తూ.. దర్శకత్వం వహించిన ఈ చిత్రం యూత్ కనెక్ట్ అయ్యే కథ కావడంతో ప్రేక్షకులు హిట్ చేశారు.  ఈ సినిమా ఓటీటీలో కూడా మంచి వ్యూస్ నే సాధించింది. ఏజీఎస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై కల్పతి ఎస్ అఘోరం, కల్పతి ఎస్ గణేష్, కల్పతి ఎస్ సురేష్ నిర్మించారు. ఇవానా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో యోగిబాబు, రాధిక కీలక పాత్ర పోషించారు. 

హీరోయిన్ గా నటించిన ఇవానా అందానికి ప్రేక్షకులందరూ  ఫిదా అయ్యారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా మరోసారి హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఈ లవ్ టుడే టీవీలో టెలికాస్ట్ అయింది. ఏప్రిల్ 09న ఈ సినిమా టీవీలో ప్రసారం కాగా.. ఈ మూవీ 6.1 టీఆర్పీ రేటింగ్ నమోదు చేసింది. దీంతో మరోసారి రికార్డుకెక్కినట్టయింది. 

Also Read :  “ఆర్య” సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ శ్రావ్య గుర్తుందా..? ఇప్పుడు ఎలా ఉందో చూస్తే క‌ళ్లు తిప్పుకోలేరు..!

Visitors Are Also Reading