Home » పుష్ప 2 గురించి ఆ మాజీ ఐజీ ఏమన్నారో తెలుసా ?

పుష్ప 2 గురించి ఆ మాజీ ఐజీ ఏమన్నారో తెలుసా ?

by Anji
Ad

ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ నటించిన “పుష్ప- ది రైజ్”   బాక్సాఫీస్ వద్ద ఎంతటి సెన్షేషన్ క్రియేట్ చేసిందో ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. అటు దర్శకుడు సుకుమార్, ఇటు  అల్లు అర్జున్ క్రేజ్ అమాంతం పెరిగిపోయిందనే చెప్పాలి.  దీనికి సీక్వెల్ గా ఇప్పుడు పుష్ప 2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.  దీనికి “పుష్ప ది రూల్” అనే టైటిల్ ఫిక్స్ చేశారు. 

Also Read :  మీ భర్తలో ఈ 4 లక్షణాలు కనిపిస్తే..పర స్త్రీతో సంబంధం ఉన్నట్టే..4వది చాలా ఇంపార్టెంట్..!!

Advertisement

మరోవైపు పుష్ప సినిమా దర్శకుడు సుకుమార్, మైత్రీ మూవీస్ మేకర్స్ కార్యాలయాలపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. పుష్ప సినిమా గురించి ఆంధ్రప్రదేశ్ టాస్క్ ఫోర్స్ మాజీ ఐజీ కాంతారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పుష్ప సినిమా పార్ట్ 1లో అటవీ, పోలీస్ అధికారులను కించపరిచేవిధంగా దర్శకుడు సినిమాను చిత్రీకరించారు. కనీసం పుష్ప 2లో నైనా అడవులను, ఎర్రచందనంను కాపాడటానికి అధికారులు, సిబ్బంది నిర్వర్తించిన బాధ్యతలు, త్యాగాలను చూపించాలని పేర్కొన్నారు. తాజాగా తిరుపతిలోని ఏపీ టాస్క్ ఫోర్స్ కార్యాలయాన్ని సందర్శించారు.  

Advertisement

Also Read :  తండ్రి అంటేనే త్యాగం..అనే పదానికి నిలువెత్తు నిదర్శనం ఈ వ్యక్తి..ఎంత పని చేశాడంటే..!!

తాను విధులు నిర్వర్తించిన సమయంలో ఎర్రచందనం సంరక్షణ తీసుకున్న చర్యలు, స్మగ్లర్లతో చేసినటువంటి పోరాటాలు అవగాహన కల్పించడానికి తీసుకున్నటువంటి చర్యలను ఆయన వెల్లడించారు. అదేవిధంగా పుష్ప సినిమా తెరకెక్కించే సమయంలో దర్శకుడు సుకుమార్, అసిస్టెంట్లు వచ్చి మా వద్ద పలు కీలక సమాచారాన్ని సేకరించారని గుర్తుచేశారు. పుష్ప సినిమాను కమర్షియల్ గా విజయవంతం చేయడానికి పోలీసులను, అటవీశాఖ అధికారులను లంచగొండులుగా, పబ్లిక్ చెడు అభిప్రాయం కలిగే విధంగా కించపరిచేలా చేయడం మంచిది కాదన్నారు. ముఖ్యంగా స్మగ్లింగ్ ను అరికట్టేందుకు అనువుగా ఈ చిత్రాన్ని రూపొందించాలని ఒక పౌరుడిగా కోరుతున్నట్టు వెల్లడించారు. 

Also Read :  Hyper Aadi: అమ్మో ఆది పేరిట ఇన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా.. ఎంతో తెలిస్తే నోరేళ్ళబెడతారు..!!

Visitors Are Also Reading