Home » “ఆర్య” సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ శ్రావ్య గుర్తుందా..? ఇప్పుడు ఎలా ఉందో చూస్తే క‌ళ్లు తిప్పుకోలేరు..!

“ఆర్య” సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ శ్రావ్య గుర్తుందా..? ఇప్పుడు ఎలా ఉందో చూస్తే క‌ళ్లు తిప్పుకోలేరు..!

by AJAY
Ad

సైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా న‌టించిన సినిమా ఆర్య‌. ఈ సినిమాకు సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ల‌వ్ ఎంట‌ర్టైన‌ర్ గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమాలో న‌టించిన చైల్డ్ ఆర్టిస్ట్ లు కూడా త‌మ న‌ట‌న‌తో మెప్పించిన సంగ‌తి తెలిసిందే. అందులో చైల్ట్ ఆర్టిస్ట్ శ్రావ్య కూడా ఒక‌రు.

Advertisement

 

బుజ్జి బుజ్జి మాట‌ల‌తో క‌ళ్ల జోడు పెట్టుకుని క‌నిపించిన శ్రావ్య ప్రేక్ష‌కుల దృష్టిని తన వైపుకు తిప్పుకుంది. \ఇక ఈ సినిమాలోనే కాకుండా సంద‌డే సంద‌డి సినిమాలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా న‌టించి శ్రావ్య మెప్పించింది. ఇక ప్ర‌స్తుతం ఒక‌ప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ లు చాలా మంది హీరోలు హీరోయిన్ లు గా ఎంట్రీ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. అంతే కాకుండా చిన్న‌ప్పుడు ప్రేక్షకుల‌ను మెప్పించిన‌ట్టే ఇప్పుడు కూడా న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంటున్నారు.

Advertisement

రీసెంట్ గా బ‌లగంలో సినిమాలో హీరోయిన్ గా న‌టించిన కావ్య క‌ల్యాణ్ రామ్ సూప‌ర్ హిట్ అందుకుని వ‌రుస ఆఫ‌ర్ లు అందుకుంటుంది. అంతేకాకుండా ఒక‌ప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా న‌టించిన తేజ స‌జ్జ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చి వ‌రుస విజ‌యాల‌ను అందుకుంటున్నాడు. ఇక ఇప్ప‌టికే శ్రావ్య కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేసింది. ల‌వ్ యూ బంగారం సినిమాతో శ్రావ్య హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా ఆశించిన‌మేర విజ‌యం సాధించ‌లేదు. దాంతో సినిమాల నుండి దూర‌మై ప్ర‌స్తుతం అమెరికాలో ఉంటుంది. శ్రావ్య‌కు సోష‌ల్ మీడియా మాత్రం ఫాలోవ‌ర్స్ సంఖ్య ఎక్కువగానే ఉంది.

ALSO READ :యాక్సిడెంట్ లో కాపాడిన వ్య‌క్తికి ఎంత ఇచ్చాడు..? ఎట్ట‌కేల‌కు బ‌య‌ట‌పెట్టి సాయిధ‌రమ్ తేజ్..!

Visitors Are Also Reading