Home » బ్లాక్ ద్రాక్ష… గ్రీన్ ద్రాక్ష… ఏది మేలు? వీటిని తింటే ఏమవుతుంది!

బ్లాక్ ద్రాక్ష… గ్రీన్ ద్రాక్ష… ఏది మేలు? వీటిని తింటే ఏమవుతుంది!

by Bunty
Ad

గ్రీన్ కలర్ కంటే, నల్ల ద్రాక్ష ఆరోగ్యానికి మంచిది. నల్ల ద్రాక్ష రుచిలో తీపిగా ఉంటుంది. వీటివల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. నల్లటి ద్రాక్షలో సి-విటమిన్, ఏ విటమిన్, బి6, ఫోలిక్ ఆమ్లం పుష్కలంగా ఉంటాయి. ద్రాక్ష పండ్లలో ఉండే గ్లూకోజ్, మెగ్నీషియం, సీట్లిక్ యాసిడ్ వంటి అనేక పోషకాలు మనల్ని అనేక వ్యాధుల నుంచి దూరంగా ఉంచడానికి సహాయపడతాయి.

READ ALSO : వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ తో కాంగ్రెస్ పార్టీ పొత్తు!

Advertisement

నల్ల ద్రాక్షను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఊబకాయాన్ని నివారించడంలో సహాయపడటమే కాకుండా మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు, చర్మం, జుట్టుకు సంబంధించిన సమస్యలను అధిగమించవచ్చు. నల్ల ద్రాక్ష పండ్లను తినటం వల్ల శరీరం బరువును తగ్గించుకోవచ్చు. ఊబకాయంతో బాధపడుతున్న వారు నల్ల ద్రాక్షను తరచుగా తీసుకోవాలి. ఇది రక్తంలో కొలెస్ట్రాల్ ఏర్పడటం ఆపడం ద్వారా ఊబకాయం వంటి ఇతర ఆరోగ్య సమస్యలను కూడా నివారిస్తుంది. నల్ల ద్రాక్షను తీసుకోవడం వల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.

Advertisement

READ ALSO : RC 15 : ‘గేమ్ చేంజర్’ గా రామ్ చరణ్… ఆ టైటిల్ పెట్టడానికి కారణం ఇదే!

Green, black or red grapes: Know which is the healthiest of them all | HealthShots

 

అదేవిధంగా నల్ల ద్రాక్ష తినడం ద్వారా మానసిక కార్యకలాపాలను నయం చేసుకోవచ్చు. మైగ్రేన్ వంటి వ్యాధుల నుంచి కూడా బయటపడవచ్చు. మధుమేహాన్ని నయం చేయడంలో కూడా నల్ల ద్రాక్షలు సహాయపడతాయి. నల్ల ద్రాక్షలో రెస్వేరాటాల్ అనే పదార్థం ఉంటుంది. ఇది రక్తంలో ఇన్సులిన్ స్థాయిని పెంచడం ద్వారా శరీరంలోని చక్కర మొత్తాన్ని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. జుట్టుకు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే ఎక్కువగా నల్ల ద్రాక్ష పండ్లను తినాలి. వీటిలో లభించే విటమిన్ ఈ జుట్టు, ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

READ ALSO : ఆ హీరోయిన్‌ తో నాగ చైతన్య రిలేషన్‌…ఇలా అడ్డంగా దొరికిపోయారుగా!

Visitors Are Also Reading