Home » ఉక్రెయిన్‌లో భార‌త విద్యార్థుల వెత‌లు.. ఆనంద్ మ‌హీంద్రా సంచ‌ల‌న నిర్ణ‌యం..!

ఉక్రెయిన్‌లో భార‌త విద్యార్థుల వెత‌లు.. ఆనంద్ మ‌హీంద్రా సంచ‌ల‌న నిర్ణ‌యం..!

by Anji
Ad

ఉక్రెయిన్ ఉడికిపోతుంది. ర‌ష్యా దాడుల‌తో ఉక్రెయిన్ అత‌కుత‌లం అయిపోతుంది. దిక్కుతోచ‌ని స్థితిలో అక్క‌డి ప్ర‌జలు ఉన్నారు. సైన్యంతో ఉక్రెయిన్ పై విరుచుకుప‌డుతుంది ర‌ష్యా. ఈ యుద్ధంలో ఎంతో మంది సైనికుల‌తో సామాన్యులు కూడా ప్రాణాలు విడిచారు. రెండు దేశాలు ఢీ అంటే ఢీ అన్న‌ట్టుగా యుద్ధానికి కాలు దువ్వుతూ ఉన్నాయి. ఇప్ప‌టికే వంద‌లాది మంది ప్రాణాలు గాలిలో క‌లిసాయి.

Also Read :  ఊరి పేర్లే సినిమా పేర్లు! ఇంకేమైనా మిస్ అయ్యామా?

Advertisement


ఈ త‌రుణంలోనే ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త ఆనంద్ మ‌హేంద్ర ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. మ‌హీంద్రా గ్రూపు ఆధ్వ‌ర్యంలో మెడిక‌ల్ క‌ళాశాల నిర్మాణానికి ఆయ‌న సిద్ధ‌మ‌య్యారు. భార‌తీయులు ఎక్కువ‌గా మెడిసిన్ కోసం ఉక్రెయిన్ వెళ్తుంటారు. ఇప్పుడు యుద్ధం జరుగుతున్న నేప‌థ్యంలో అక్క‌డ చిక్కుకున్న మ‌న దేశ విద్యార్థుల‌ను భార‌త్‌కు త‌ర‌లిస్తున్నారు. విద్యార్థుల‌ను త‌ర‌లించేందుకు ఆప‌రేష‌న్ గంగ‌న్‌ను ప్ర‌భుత్వం చేప‌ట్టింది. ఈ త‌రుణంలో మ‌హీంద్రా గ్రూపు ఆధ్వ‌ర్యంలో మెడికల్ క‌ళాశాల నిర్మించాల‌ని మ‌హేంద్ర నిర్ణ‌యం తీసుకున్నారు.

Advertisement


త‌గు చ‌ర్య‌లు తీసుకోవాలంటూ మ‌హీంద్రా యూనివ‌ర్సిటీ బాధ్యుల‌కు సూచ‌న‌లు చేశారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌కటించారు ఆనంద్ మ‌హీంద్రా. మ‌న‌దేశంలో మెడిక‌ల్ క‌ళాశాల‌లు లేవా..? ఎందుకు ఇంత‌మంది మెడిస‌న్ చ‌దివేందుకు వేరే దేశాల‌కు వెళ్తున్నారు..? ఈ విష‌యంపై దృష్టి పెట్టాల్సిన అవ‌స‌ర‌ముంది. ఇందుకోసం మ‌హీంద్రా యూనివ‌ర్సిటీ ఆధ్వ‌ర్యంలో మెడిక‌ల్ క‌ళాశాల పెట్టేందుకు అవ‌కాశ‌ముందా..? అంటూ టెక్ మ‌హీంద్రా చీఫ్ సీపీ గుర్నానిని ఆదేశించారు. ప్ర‌స్తుతం ఆనంద్ మ‌హీంద్ర ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Also Read :  తిరుప‌తిలో అవి దొర‌కట్లేదంటూ న‌రేష్ ట్వీట్…నువ్వు నీ అతి అంటూ నెట్టింట ట్రోల్స్..!

Visitors Are Also Reading