Telugu News » Blog » తిరుప‌తిలో అవి దొర‌కట్లేదంటూ న‌రేష్ ట్వీట్…నువ్వు నీ అతి అంటూ నెట్టింట ట్రోల్స్..!

తిరుప‌తిలో అవి దొర‌కట్లేదంటూ న‌రేష్ ట్వీట్…నువ్వు నీ అతి అంటూ నెట్టింట ట్రోల్స్..!

by AJAY
Ads

సెల‌బ్రెటీలను ప్ర‌జ‌లు రోల్ మాడ‌ల్ గా తీసుకుంటారు. చాలా మంది సెల‌బ్రెటీల‌ను అనుక‌రిస్తూ ఉంటారు. వాళ్ల‌లా డ్రెస్సులు వేసుకోవ‌డం లాంటివి వాళ్లు ఏం చేస్తే అదే చేయ‌డం లాంటివి కూడా చేస్తారు. కానీ అలాంటి సెల‌బ్రెటీలు త‌ప్పు చేసినా అతి చేసినా నెటిజన్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తారు. అలాగా ఇప్ప‌డు ఓ సెల‌బ్రెటీ నెటిజ‌న్ల ఆగ్ర‌హానికి గుర‌య్యారు. ఆయ‌న మ‌రెవ‌రో కాదు. ఒక‌ప్పుడు హీరోగా కామెడీ సినిమాలతో అల‌రించి ప్ర‌స్తుతం సినిమాల‌లో కీల‌క పాత్ర‌ల‌లో న‌టిస్తున్న సీనియ‌ర్ న‌రేష్.

ఇటీవ‌ల మా ఎన్నిక‌ల స‌మ‌యంలో న‌రేష్ ఎక్కువ‌గా ట్రోల్స్ కు గుర‌య్యారు. అంతే కాకుండా సాయి ధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్ స‌మ‌యంలో కూడా ఓ స్టేట్ మెంట్ ఇచ్చి నెటిజ‌న్ల ఆగ్ర‌హానికి గుర‌య్యారు. ఇక ఇప్పుడు మరోసారి న‌రేష్ చేసిన ఓ ట్వీట్ వ‌ల్ల నెట్టింట ట్రోల్స్ ఎదురుకోవాల్సి వ‌స్తుంది. ఇంత‌కీ న‌రేష్ ఏం ట్వీట్ చేశాడు. నెటిజ‌న్లు ఎందుకు ట్రోల్స్ చేస్తున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

న‌రేష్ రీసెంట్ గా తిరుపతి వెళ్లిన‌ట్టు ఉన్నారు. అయితే తాను తిరుప‌తిలో గంట‌సేపు నైక్ బ్రాండ్ షూల కోసం గంట‌సేపు తిరిగాన‌ని కానీ అవి దొర‌క‌లేద‌ని. ఇప్పుడు హైద‌రాబాద్ వెళ్లిపోతున్నా అంటూ నరేష్ త‌న ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ సంధ‌ర్బంగా న‌రేష్ ఒక ఫోటోను కూడా షేర్ చేశారు. దాంతో నెటిజన్ లు న‌రేష్ పై ఫైర్ అవుతున్నారు.

ALSO READ : ఊరి పేర్లే సినిమా పేర్లు! ఇంకేమైనా మిస్ అయ్యామా?

ఇంత అతి అవ‌స‌ర‌మా…ఆ షూలు లేకుంటే వేరే షూలు వేసుకోలేవా అంటూ ఓ నెటిజ‌న్ రిప్లై ఇచ్చాడు. ఇక మ‌రో నెటిజ‌న్ డ‌బ్బు ఎక్కువైతే ఇలాంటి క‌థ‌లే ప‌డ‌తారు. అస‌లు నువ్వు తిరుపతి ఎందుకు వ‌చ్చావ్ గంట‌సేపు మ్యాప్ లో తిరిగావా అంటూ మ‌రో నెటిజన్ చురుక‌లు అంటించాడు. ఇదిలా ఉంటే న‌రేష్ చేసిన పోస్ట్ కంటే ఆయ‌న‌కు వ‌స్తున్న రిప్లై ల‌కే ఎక్కువ‌గా లైక్స్ వ‌స్తున్నాయి.


You may also like