Home » 2023లో రాబోయే 8 పాన్ ఇండియా సౌత్ మూవీస్ లిస్ట్..!!

2023లో రాబోయే 8 పాన్ ఇండియా సౌత్ మూవీస్ లిస్ట్..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

2023లో రాబోయే సౌత్ ఇండియన్ క్రేజీ పాన్ ఇండియా సినిమాలపై అందరి దృష్టి పడింది. సలార్ నుండి హనుమాన్ సినిమా వరకు బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి రెడీగా ఉన్నాయి..మరి ఆ 8 సినిమాల లిస్టు చూసేద్దామా..

#1.సలార్:

Advertisement

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మూవీ రాబోతోంది. ఈ చిత్రాన్ని 2023లో ఎలాగైనా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. మరి చూడాలి ఈ మూవీ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో.

#2. జైలర్:

రజనీకాంత్ నటిస్తున్న జైలర్ మూవీ 2023లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న జైలర్ చిత్రంలో కన్నడ నటుడు శివరాజ్ కుమార్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, తెలుగు నటుడు సునీల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

#3. భారతీయుడు2:

90వ దశకం చివరిలో విడుదలైన భారతీయుడు మూవీ భారీ విజయాన్ని అందుకుంది. 30 ఏండ్ల తర్వాత శంకర్, కమల్ హాసన్ కాంబోలో ఇండియన్ మూవీకి సీక్వెల్ రాబోతోంది.

also read:ఆ హీరో ఇంటిపక్కన కొత్త ఇల్లు కొన్న త్రిష…ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే…?

#4. హనుమాన్:

Advertisement

రామాయణంలోని హనుమంతుని పాత్ర ఆధారంగా తెరకెక్కుతోంది. తేజ సజ్జ నటించిన హనుమాన్ మూవీ టీజర్‌కు భారీ స్పందన లభించింది. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

#5. పొన్నియిన్ సెల్వన్ 2:

మణిరత్నం డైరెక్షన్ లో రాబోతున్న పొన్నియన్ సెల్వన్ 2 చిత్రం 2023 ఏప్రిల్ 28న పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.

#6. దసరా:

నాని దాసరా మూవీని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయనున్నారు. ఇందులో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుంది.

#7. హరి హర వీర మల్లు:

టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు చిత్రంతో పాన్ ఇండియా అరంగేట్రం చేస్తున్నాడు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు.

#8. పుష్ప 2:

అల్లు అర్జున్ హీరోగా పుష్ప ఎంతటి విజయం అందుకుందో మనందరికీ తెలుసు. పుష్ప 2 2023 లో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

also read:

Visitors Are Also Reading