Home » ఆ హీరో ఇంటిపక్కన కొత్త ఇల్లు కొన్న త్రిష…ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే…?

ఆ హీరో ఇంటిపక్కన కొత్త ఇల్లు కొన్న త్రిష…ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే…?

by AJAY
Ad

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి అభిమానులను సంపాదించుకున్నారు. తెలుగు తమిళ భాషల్లో ఈ అమ్మడికి ఎంతో ఫాలోయింగ్ ఉంది. ప్రభాస్, మహేష్ బాబు, చిరంజీవి లాంటి స్టార్ హీరోలతో త్రిష సినిమాలు చేశారు. ప్రస్తుతం త్రిష హీరోయిన్ గా నటిస్తూ మరోవైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటిస్తున్నారు.

Advertisement

రీసెంట్ గా పొన్నియన్ సెల్వన్ అనే పాన్ ఇండియా సినిమాలో నటించి అభిమానులను అలరించింది. అంతేకాకుండా రాంకీ అనే యాక్షన్ ఎంటర్టైన్మెంట్ లో నటించి ప్రశంసలు అందుకుంది త్రిష. ఈ సినిమాలో యాక్షన్ హీరోయిన్ గా త్రిష అదరగొట్టింది. ఇక ప్రస్తుతం త్రిష చేతిలో రెండు భారీ బడ్జెట్ చిత్రాలు ఉన్నాయి.

Advertisement

విజయ్ హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. అదేవిధంగా అజిత్ రాబోయే సినిమాలో కూడా త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఇక త్రిష తాజాగా ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్టుగా ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ స్టార్ హీరో విజయ్ ఇంటికి దగ్గరగా రూ.35 కోట్ల విలువ చేసే ఇంటిని త్రిష కొనుగోలు చేసినట్టు టాక్ వినిపిస్తోంది.

Also read : 20 ఏళ్లుగా చిరు విజయశాంతి ఎందుకు మాట్లాడుకోలేదో తెలుసా…? తెరవెనక జరిగింది ఇదే..!

Visitors Are Also Reading