Telugu News » Blog » అందాల రాముడు సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో.. ఎవరంటే..?

అందాల రాముడు సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో.. ఎవరంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ads

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్, హీరో, విలన్ క్యారెక్టర్,ఆర్టిస్ట్ ఇలా ఏ పాత్ర అయినా తనదైన టాలెంట్ తో మెస్మరైజ్ చేయగల నటుడు ఎవరైనా ఉన్నారు అంటే చాలామందికి గుర్తుకు వచ్చేది సునీల్ మాత్రమే.. కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సునీల్ ప్రస్తుతం సినిమాల్లో హీరోగా విలన్ గా దూసుకుపోతున్నారు. అలాంటి సునీల్ మొదటగా హీరోగా నటించిన మూవీ అందాల రాముడు.. ఈ చిత్రంలో ముందు సునీల్ అనుకోలేదట.. మరి ముందుగా హీరోను ఎవరిని అనుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

Advertisement

also read:20 ఏళ్లుగా చిరు విజయశాంతి ఎందుకు మాట్లాడుకోలేదో తెలుసా…? తెరవెనక జరిగింది ఇదే..!

Advertisement

కమెడియన్ సునీల్ హీరోగా చేసిన మొదటి సినిమా అందాల రాముడు. ఈ సినిమా ద్వారా ఆయనకు ఎంతో గుర్తింపు వచ్చింది. ఇక దీని తర్వాత అనేక సినిమాల్లో హీరోగా ఆఫర్లు వచ్చాయి. అయితే ఈ అందాల రాముడు సినిమాలో ముందుగా హీరోగా బ్రహ్మాజీని తీసుకోవాలని అనుకున్నారట చిత్ర యూనిట్. కానీ ఆ సమయంలో బ్రహ్మాజీ సింధూరం రీమెక్ లో నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు. దీంతో సునీల్ ను సంప్రదించి కథ చెబితే ఆయన ఓకే చెప్పారట.

ఇక ఇందులో స్టార్ హీరోయిన్ ఆర్తి అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన అందాల రాముడు మూవీలో సునీల్ నటన అద్భుతం.. మంచి ఎమోషన్స్ పండించారు. దీంతో సినిమా ఆడియన్స్ ను చాలా కనెక్ట్ అయింది. అప్పట్లో ఈ మూవీ 18 కోట్లు వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది. ఇక రాను రాను హీరోగా ఆయన ఎక్కువగా క్లిక్ కాలేకపోయారు. ఈ మధ్యకాలంలోనే విలన్ గా ఎంట్రీ ఇచ్చి దూసుకుపోతున్నారని చెప్పవచ్చు.

Advertisement

also read: