ప్రస్తుతం ఎక్కడ చూసినా లైగర్ సినిమా గురించే చర్చించుకుంటున్నారు. సౌత్, నార్త్ తేడా లేకుండా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా లైగర్. విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరిజగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానున్నది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించిన ఈ సినిమాను పూరిజగన్నాథ్, చార్మి, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్న అభిమానులు ఎప్పుడు ఈ సినిమా విడుదల అవుతుందా అని ఎదురుచూస్తున్నారు.
ఇవి కూడా చదవండి : కొరటాల సినిమా వాయిదా వేయనున్న ఎన్టీఆర్..?
Advertisement
మరోవైపు లైగర్ టీమ్ కొద్ది రోజుల నుంచి దేశవ్యాప్తంగా చుట్టుముడుతూ ప్రమోషన్లను వేగవంతంగా నిర్వహిస్తుంది. తాజాగా లైగర్ టీమ్ ముంబై మీడియాతో ముచ్చటించింది. అక్కడ ఓ విలేకరీ నుంచి విజయ్ దేవరకొండకి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఒకవేళ లైగర్ సినిమా ప్లాప్ అయితే అని ప్రశ్నించగా..? విజయ్ అతని ప్రశ్నకు షాకింగ్ రియాక్షన్ ఇచ్చాడు. ఇలాంటి చిన్న చిన్న విషయాలకు కోపంతో ఊగిపోవడం అవసరం లేదు. ఇదే ప్రశ్న నన్ను కొన్నేళ్ల కిందటే అడిగి ఉంటే కోపంతో ఊగిపోయే వాడిని. అప్పుడు నాకు కోపం చాలా ఎక్కువగా ఉండేది. గత కొద్ది రోజులుగా నాకు అసలు కోపం రావడం లేదు ఎందుకంటే అభిమానులు చూపిస్తున్న ప్రేమ పూర్తిగా నన్ను మార్చేసింది. ఆ ప్రేమను ఎప్పటికీ మరిచిపోలేను. ఈ సినిమా ప్లాప్ అయితే మరో సినిమా చేస్తానని సమాధానం చెప్పాడు. ప్రస్తుతం ఈ మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Advertisement
ఇవి కూడా చదవండి : బింబిసార ఓటీటీ విడుదల ఎందులో.. ఎప్పుడో తెలుసా..?
లైగర్ ప్రమోషన్స్ చేస్తూ దేశమంతటా పర్యటిస్తున్నాం. ఎక్కడికి వెళ్లినా ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను. నాకు ఆడియన్స్ ముఖ్యం. వారి కోసం మేము పని చేస్తున్నాం. ప్రేక్షకుల హృదయాలను గెలుచుకునేందుకే దేశంలోని ప్రధాన నగరాలన్ని చుట్టుముడుతున్నామని విజయ్ చెప్పుకొచ్చాడు. అతడి రియాక్షన్ చూసి అందరూ షాక్ అయ్యారు. పాన్ ఇండియా సినిమా భారీ బడ్జెట్ చిత్రాన్ని ఫ్లాప్ అంటూ ప్రస్తావిస్తే ఎవరైనా వారిపై కోపంతో ఊగిపోవాల్సిందే. కానీ విజయ్ ఆ విలేకరీతో వ్యవహరించిన తీరుకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అతనిపై అభిమానం మరింత పెరిగిందంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి : ఆ స్టార్ హీరోతో మళ్లీ ప్రేమలో పడిన హన్సిక.. పెళ్లి చేసుకుంటుందా..?