Home » ఆ స్టార్ హీరోతో మ‌ళ్లీ ప్రేమ‌లో ప‌డిన హ‌న్సిక‌.. పెళ్లి చేసుకుంటుందా..?

ఆ స్టార్ హీరోతో మ‌ళ్లీ ప్రేమ‌లో ప‌డిన హ‌న్సిక‌.. పెళ్లి చేసుకుంటుందా..?

by Anji
Ad

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో కేవ‌లం ప‌దిహేనేళ్ల వ‌య‌స్సులో ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయిన హీరోయిన్ల జాబితాలో హ‌న్సిక పేరు తొలుత వినిపిస్తుంది. బాల‌నటిగా చిన్న‌త‌నం నుంచే ప‌లు సినిమాల‌లో న‌టించింది హ‌న్సిక‌. ఉన్న‌ట్టుండి కొంత‌కాలం పాటు క‌నిపించ‌కుండా పోయింది. మ‌ళ్లీ అదిరిపోయే అందం, గ్లామ‌ర్‌, బాడీ స్ట్ర‌క్ష‌ర్‌తో సినిమాలోకి ఎంట్రీ ఇవ్వ‌డంతో అటు ఫిలిం ఇండ‌స్ట్రీ, ఇటు ప్రేక్ష‌కులు ఒక్క‌సారిగా షాక్ కి అయ్యారు.

ఇవి కూడా చ‌దవండి :  ఒక్క వెల్లుల్లి రెబ్బ‌తో టాయిలెట్ క్లీన్‌.. ఎలాగో తెలుసా..?

Advertisement

టాలీవుడ్‌లో హ‌న్సిక పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన దేశ‌ముదురు సినిమాతో ప‌రిచ‌య‌మైంది. అప్పుడు హ‌న్సిక‌, అందం, గ్లామ‌ర్ ఓ చూసి అభిమానులు ఫిదా అయ్యారు. మరుస‌టి రోజు నుంచి ఆమెకు ఫాలోవ‌ర్స్ మారిపోయారు. ఆ త‌రువాత తెలుగు, త‌మిళం, క‌న్న‌డ ఇండ‌స్ట్రీల నుంచి ఈ అమ్ముడికి వ‌రుస‌గా సినిమా ఆఫ‌ర్లు వ‌చ్చాయి. ఈమె తెలుగు కంటే ఎక్కువ‌గా త‌మిళంలోనే సినిమాలు చేసింది ఈ బ్యూటీ. ఈమె అల‌నాటి సీనియ‌ర్ న‌టి కుష్భును పోలి ఉంద‌ని చాలా మంది పేర్కొన్నారు. అంతేకాదు.. హ‌న్సిక కోసం అభిమానులు గుడి క‌ట్టార‌ని అప్ప‌ట్లో వార్త‌లు తెగ వైర‌ల్ అయ్యాయి. తాజాగా హ‌న్సిక పెళ్లి చేసుకోబోతుంద‌నే టాక్ వినిపిస్తుంది.

Advertisement

ఇవి కూడా చ‌దవండి :  బ్ర‌హ్మంగారు భ‌విష్య‌త్‌లో ఏమేం జ‌రుగుతాయో చెప్పిన విష‌యాల గురించి మీకు తెలుసా..?

కోలీవుడ్ ల‌వ‌ర్ బాయ్ శింబు, హ‌న్సిక గ‌తంలో ల‌వ్‌లో ఉన్నార‌ని చాలా వార్త‌లు వినిపించాయి. వీరిద్ద‌రూ డేటింగ్‌లో ఉన్నార‌ని.. త్వ‌ర‌లో పెళ్లి పీట‌లు కూడా ఎక్కే అవ‌కాశ‌ముంద‌ని జోరుగా ప్ర‌చారం సాగింది. కానీ అనుకోకుండా వీరిద్ద‌రూ విడిపోయారు. శింబు, హ‌న్సిక ప్రేమ‌లో ఉన్న‌ప్పుడు త‌న ప్రియురాలి కోసం శింబు ఏదైనా చేసేవాడు. ఇక ఆమె ఫారిన్ షూటింగ్ కి వెళ్లింద‌ని తెలిసి మ‌రీ అక్క‌డికి వెళ్లారు. అనుకోకుండా బ్రేక‌ప్ అయినా త‌రువాత చాలా కాలం పాటు వీరిద్ద‌రూ క‌లిసి సినిమాలు చేయ‌లేదు. ఇటీవ‌ల హ‌న్సిక ఓ యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేయ‌గా.. ఓ అభిమాని శింబు గురించి అడ‌గ్గా ప్రేమ‌లో విడిపోయిన వాళ్లు స్నేహితులుగా ఉండ‌లేరా..? అని ప్ర‌శ్నించింది. వీరు మ‌ళ్లీ క‌లిసిపోయారని అంతా భావించారు. ఈ త‌రుణంలో హ‌న్సిక శింబుతో పెళ్లికి సై అన్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చ‌దవండి : సీక్రెట్ గా పెళ్లి చేసుకుని హాట్ టాపిక్ గా మారిన టాలీవుడ్ ముద్దుగుమ్మ‌లు వీరే..!

Visitors Are Also Reading