Home » ఇండియాలో ఎక్కువ మంది చెప్పే అబద్ధాలు ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

ఇండియాలో ఎక్కువ మంది చెప్పే అబద్ధాలు ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

Ad

ఈ మానవ సమాజంలో నిజాయితీగా బతకడం చాలా కష్టమే. అబద్ధాలు చెప్పి మోసాలు చేసే వారికే మంచి లైఫ్ ఉంది. అలాంటి వారిని చాలామంది నమ్ముతూ ఉంటారు. నమ్మకంగా మంచి పనులు చేసే వారిని ఎక్కువ శాతం జనాలు చులకన చేసి చూస్తారు. ఏ మనిషి అయినా సరే ప్రతిక్షణం నిజాయితీగా బతకడం చాలా కష్టం. ఏదో ఒక సందర్భంలో తప్పనిసరిగా అబద్ధం చెప్పవలసి వస్తుంది.

also read:“పొన్నియాన్ సెల్వన్” మూవీ ద్వారా రాజమౌళి ఆ పాఠం నేర్చుకోవాలా..?

Advertisement

అయితే కొంతమంది సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి అబద్ధాలు చెబితే, మరి కొంతమంది ప్రతి చిన్న విషయానికి అబద్ధాలు చెబుతూ ఉంటారు. మన దేశంలో ఎక్కువమంది ఏ సందర్భాల్లో ఇలాంటి అబద్ధాలు చెబుతారో ఇప్పుడు చూద్దాం..

రేపటి నుంచి మందు సిగరెట్ మానేస్తాను:
కొంతమంది మందు సిగరెట్ కు బాగా అడెక్ట్ అయి దాన్ని మానేయాలని ప్రయత్నం చేస్తుంటారు. ఒక్కోసారి బాగా తాగి ఇక రేపటి నుంచి మందు సిగరెట్ మానేస్తానని అంటారు కానీ ఆ పని చేయరు.

నా దగ్గర రూపాయి లేదు:
కొంతమంది చేతుల్లో దగ్గర వందలు వేల రూపాయలు ఉన్న వారికి ఇవ్వాలనిపించనప్పుడు నా దగ్గర రూపాయి లేదని అబద్ధం చెబుతారు.

Advertisement

పనుంది రాలేను:
ఏదైనా ప్రదేశానికి వెళ్తున్న సమయంలో ఎవరైనా రమ్మని అడిగితే, ఆ ప్రదేశం వెళ్లడానికి వారికి ఇష్టం లేకపోతే ఏదైనా పని ఉందని అబద్ధం చెపుతూ ఉంటారు.

also read:మహేష్ బాబు ఆ సమస్య వల్లే ఎక్కువగా ఫంక్షన్లకు రాడు..!

నువ్వేనా ఫస్ట్ లవ్:
చాలామంది ఆడవాళ్ళు మగవాళ్ళు ప్రేమించిన వారితో అబద్ధాలు చెబుతారు. నువ్వే నా ఫస్ట్ లవ్ అంటూ ఎవరితో లవ్ లో పడితే వారితో అంటుంటారు. ఇది కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రేమికులు వాడుతారు.

అబద్ధం చెప్పను:
కొంతమంది అబద్ధాలు చెబుతూనే నేను అసలు అబద్ధం చెప్పనని అంటుంటారు. వారు నోరు తెరిస్తే అబద్దాలు చెబుతూ ఉంటారు.

ఫోన్ సైలెంట్ లో ఉంది:
కొంతమంది ఎదుటి వ్యక్తితో ఫోన్లో మాట్లాడడం ఇష్టం లేకపోతే , ఫోన్ సైలెంట్ లో ఉందని అబద్ధం చెబుతుంటారు. వారు ఫోన్ చూసి కూడా ఈ అబద్ధాన్ని వాడతారు.

also read:

Visitors Are Also Reading